హైదరాబాద్ నగర శివారులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నడిరోడ్డుపై పూర్తిగా దగ్ధమైంది.ప్రముఖ ట్రావెల్స్ సంస్థ ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అగ్ని కీలల్లో చిక్కుకుని కాలిబూడిదైపోయినది . అయితే ప్రయాణికులతో వెళుతున్న బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగగా డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో తృటి లో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏకంగా బస్సులో 26 మంది ప్రయాణికులు ఉండటం గమనార్హం. ఇక నడిరోడ్డు పైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలి బూడిదై పోవడంతో భారీగా మంటలు చెలరేగాయి... దీంతో అటు ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

 

 

 వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం శివారులో  శుక్రవారం ఉదయం ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సు  అగ్నిప్రమాదంకి గురైంది . ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో  ఈ ప్రమాదం జరిగింది. అయితే అప్పటి వరకు బాగానే ఉన్నా ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం సమీపంలోకి రాగానే... బస్సు ముందు భాగంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇక దీన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యాడు. దీంతో వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. మరోవైపు అటు ప్రయాణికులను కూడా అప్రమత్తం చేసాడు డ్రైవర్. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఏకంగా బస్సులు 26 మంది ప్రయాణికులు ఉండటం గమనార్హం. 

 

 

 ఇక ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందకి దిగగానే క్షణాల్లో అందరూ చూస్తుండగానే ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు కాలి బూడిద అయింది. ఇక బస్సులో నుంచి ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినప్పటికీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల లగేజి మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయింది. అయితే తొలుత బస్సు ఇంజన్ నుంచి మంటలు వ్యాపించినట్లు గమనించిన ప్రయాణికులు డ్రైవర్ కు సమాచారం అందించారు. ఇక డ్రైవర్ పరిస్థితిని అర్థం చేసుకున్న వెంటనే బస్సు రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులు అందరిని బస్సు నుంచి కిందకి దింపాడు. ఇక వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు ప్రయాణికులు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఫైరింజన్లతో  మంటలను ఆర్పారు. ఇక దీనిపై ప్రయాణికులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక ఒక్కసారిగా రోడ్డుపైనే బస్సు పూర్తిగా దగ్ధమై భారీగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు చుట్టుపక్కల స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: