అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంకి వ్యతిరేకంగా  దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న  విషయం తెలిసిందే. ఇక దీనిపై ఎన్నో రోజుల పాటు నిరసనలు జరగ్గా.. నిరసనలు  ఉధృతంగా కూడా మారాయి. అయితే రోజురోజుకు ఉద్రిక్తంగా మారడంతో ఎన్ఆర్సీ విషయంలో వెనకడుగు  వేసింది కేంద్ర ప్రభుత్వం.కానీ  జాతీయ జనాభా పట్టిక అమలు చేసేందుకు నిర్ణయించింది. అయితే జాతీయ జనాభా పట్టిక ఎన్ఆర్సి ఒకటే అనే ప్రచారం మొదలైంది. అయితే ఎన్ఆర్సి జాతీయ జనాభా పట్టిక ఒకటి కాదు అని బీజేపీ నేతలు ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చిన దీనిపై ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది. ఇకపోతే ప్రస్తుతం జాతీయ జనాభా పట్టిక దేశవ్యాప్తంగా తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని హోంమంత్రి అమిత్ షా ప్రకటన కూడా చేశారు. 

 


 ఈ నేపథ్యంలో ప్రస్తుతం జాతీయ జనాభా పట్టిక కు సంబంధించి మరో వార్త కూడా ప్రచారం జరుగుతుంది . జాతీయ జనాభా పట్టిక లో భాగంగా అందరిని వివరాలు అడుగుతారని.. వివరాలతో పాటు పూర్తి ఆధారాలు కూడా సేకరిస్తారని...  ఇలా ఆధారాలు ఇవ్వకపోతే జాతీయ జనాభా పట్టిక లో డి  అనే ఆప్షన్ పెడతారు అంటూ ప్రస్తుత జాతీయ జనాభా పట్టిక పై ఒక ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై స్పందించిన హోమంత్రి అమిత్ షా  జాతీయ జనాభా పట్టికలో  డి అనే ఆప్షన్ లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.. ఇకపోతే జాతీయ జనాభా పట్టిక పై అటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. 

 

 మొన్నటివరకు పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు పలికిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు జాతీయ జనాభా పట్టిక కు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నితీష్ కుమార్, జగన్ లు  తమ రాష్ట్ర పరిధిలో జాతీయ జనాభా పట్టిక అమలు చేయబోమని అంటూ స్పష్టం చేశారు. అయితే దీనిపై రాజకీయ విశ్లేషకులు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. జాతీయ జనాభా పట్టిక లో పూర్తి వివరాలు అందించనప్పుడు మాత్రమే సమస్యలు వచ్చి పడతాయని పూర్తి వివరాలు ఇవ్వడం వల్ల ఎలాంటి సమస్యలు రావు వారు చెబుతున్నారు. చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం జాతీయ జనాభా పట్టిక పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: