స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశంపై వైసీపీ నుంచి విమర్శలు ఇంకా ఆగడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైసీపీ నేతలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కమ్మ వైరస్‌ సోకిన వ్యక్తులు చంద్రబాబుకు సహకరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఘాటుగా విమర్శించారు. కరోనా వ్యాధి కాదు.. స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోవడం ప్రజాస్వామ్యానికి విపత్తు అని ఆయన అన్నారు.

 

 

 

అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేయడం చంద్రబాబు నైజమన్న సుధాకర్ బాబు.. ఏపీకి కమ్మ వైరస్ సోకి 40 ఏళ్లు దాటిందన్నారు. ఈ వైరస్‌ను ఎన్టీఆర్‌పై రుద్దాలని చూశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడం చంద్రబాబు నైజం. కరోసా సాకుతో ఎన్నికలు వాయిదా వేశారు. నారా చంద్రబాబు కే వైరస్‌ సోకినటువంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థలో, పాలన వ్యవస్థల్లో ఉన్నారు. అనేక చోట్ల ఇలాంటి వ్యక్తులు కూర్చొని చంద్రబాబు కుట్రలో భాగస్వాములు అవుతున్నారని విమర్శించారు.

 

 

చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ కుట్రపూరితమైన, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నారని సుధాకర్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలను గమనించిన ఆయన సొంత సామాజిక వర్గ ప్రజలు మా నియోజకవర్గంలో వైసీపీకి మద్దతు పలికారన్నారు సుధాకర్ బాబు. కరణం బలరాం వంటి నేతలు వైయస్‌ జగన్‌కు మద్దతు పలకడం శుభపరిణామమన్నారు.

 

 

కే వైరస్‌ పట్టిన వారిని పత్రికాధినేతలను, వ్యవస్థల్లో పని చేసే వారిని చంద్రబాబు వాడుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే కోర్టుకు వెళ్తారు. శాసన సభ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు కే వైరస్‌ సోకిన శాసన మండలిని వాడుకున్నారని సుధాకర్ బాబు విమర్శించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: