కర్నూలు జిల్లాలో బైరెడ్డి ఫ్యామిలీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎన్నో ఏళ్ల నుంచి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఉంటూ వస్తున్నారు. మొదట్లో టీడీపీలో ఉన్న ఆయన, తర్వాత సొంతంగా పార్టీ పెట్టి దాన్ని మూసేసి, తర్వాత కాంగ్రెస్‌లో చేరి, నెక్స్ట్ ఎన్నికల ముందు టీడీపీకి మద్ధతు తెలిపి, చివరికి ఇప్పుడు బీజేపీలో చేరారు. ఇక బైరెడ్డి అన్న కుమారుడు siddharth REDDY' target='_blank' title='బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు.

 

యువనాయకుడుగా ఉన్న సిద్ధార్థ్..తన పొలిటికల్ ఎంట్రీ వైసీపీలో ఇచ్చారు. ప్రస్తుతం నందికొట్కూరు నియోజకవర్గంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. సిద్ధార్థ్ రాజకీయాల్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే చాలా క్రేజ్ తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయనలో ఉన్న దూకుడు, తెగింపుకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అయితే ఇంత క్రేజ్ ఉండటం వల్లే, ఆయన్ని సొంత పార్టీ వాళ్లే కాస్త తోక్కేసే కార్యక్రమం కూడా జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

 

అయితే ఆ విషయం కాసేపు పక్కనబెడితే ఇదే బైరెడ్డి ఫ్యామిలీ నుంచి మరో కొత్త నాయకురాలు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి ప్రస్తుతం కాస్త హైలైట్ అయ్యే కార్యక్రమాలు చేస్తున్నారు. తన తండ్రితో పాటు బీజేపీలో చేరిన శబరి, తాజాగా వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌గా విమర్శలు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో సీఎం జగన్, ప్రభుత్వ ఉన్నతాధికారి రమేశ్‌లు పారాసిట్మల్ వాడాలని చెప్పిన విషయం తెలిసిందే.

 

ఇక దీనిపై ఆమె స్పందిస్తూ, తాను ఒక డాక్టర్‌ని అని అసలు పారాసిట్మల్‌కు కరోనా తగ్గదని చెబుతూ కాస్త ఘాటుగానే విమర్శలు చేశారు. ఇక ఆమె కామెంట్లపై వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. దీంతో మళ్ళీ శబరి బయటకొచ్చి, తనని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తి లేదనే తేల్చిచెప్పేశారు. అయితే ఈ విధంగా శబరి కాస్త డేరింగ్‌గా మాట్లాడుతూ...బాగా హైలైట్ అవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది. వైసీపీలో ఉన్న తన సోదరుడు సిద్ధార్థ్ మాదిరిగానే క్రేజ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఈ విధంగా చేస్తే మాత్రం ఆమెకి క్రేజ్ రావడం పక్కనబెడితే, ఉన్న పరువు పోయేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: