ఏపీలో క‌రోనా కాటుతో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య క్ష‌ణ క్ష‌ణానికి పెరుగుతోంది. మంగ‌ళ‌వారం ఉద‌యం వ‌ర‌కు ఏపీలో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య కేవ‌లం 27గా ఉంది. మంగ‌ళ‌వారం సాయంత్రానికి ఇది మ‌రో 17 పెరిగి 44కు చేరుకుంది. ఇదే పెద్ద షాక్ అనుకుంటే బుధ‌వారం ఉద‌యానికి ఈ కేసుల సంఖ్య ఏకంగా మ‌రో 14 పెరిగి 58కు వెళ్లిపోయింది. కేవ‌లం ఒక్క రోజు వ్య‌వ‌ధిలో 31 కేసులు అంటే మామూలు విష‌యం కాదు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోనే ఒక్క‌సారిగా 14 కేసులు న‌మోదు అయ్యాయి. 

 

ఇక వీళ్లంతా కూడా ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. ఈ ప్రార్థ‌న‌ల‌కు ఏపీ, తెలంగాణ‌తో పాటు త‌మిళ‌నాడు, కేర‌ళ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్య‌లో ముస్లింలు త‌ర‌లి వెళ్లారు. ఇప్పుడు వీరిలో చాలా మందికి క‌రోనా వ‌చ్చేసింది. ఇక వీరు ఎంత మందికి క‌రోనా అంటిస్తారు ? అన్న‌ది కూడా అర్థంకాని పరిస్థితి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న ఈ మర్కజ్‌ అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచింది. ఏటా మన దేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ మర్కజ్‌కు వస్తుంటారు. 

 

ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ జ‌రిగిన సామూహిక ప్రార్థ‌న‌ల్లో వేలాది మంది పాల్గోన్నారు. అప్ప‌టికే వీరిలో కొంత మందికి వైర‌స్ సోకింది. ఈ విష‌యం తెలియ‌ని వారు అంద‌రూ క‌లిసి మెలిసే ఉన్నారు. ఇప్పుడు వీరి ద్వారా అక్క‌డ‌కు వ‌చ్చిన మ‌రి కొంత మందికి కూడా క‌రోనా సోకింది. ఇప్పుడు వారు ఎవ‌రి ఇళ్ల‌కు వారు వెళ్లిపోయారు. 14 రోజుల అనంతరం ఈ మహమ్మారి బారిన పడ్డారని తెలియడంతో అటు అధికారుల్లో, ఇటు ప్రజల్లో ఆందోళనతో పాటు అప్రమత్తతా పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఢిల్లీ నుంచి వ‌చ్చిన వారి కోసం అధికారులు, పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: