క‌రోనా వ్యాప్తికి దేశం అంత‌టా లాక్ డౌన్ స్ట్రిక్ట్‌గా అమ‌లు చేయాల‌న్న ఆదేశాలు ఉన్నాయి. ఈ విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం చాలా కఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఇదే తెలంగాణ‌లోని నిర్మల్ జిల్లా భైంసాలో స్థానికులు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఆదేశాలను తుంగలొ తొక్కేస్తున్నారు. ఇప్ప‌టికే భైంసా ప‌ట్ట‌ణాన్ని కేంద్ర ప్ర‌భుత్వం తీవ్ర‌మైన హాట్ స్పాట్ ప్రాంతంగా గుర్తించారు. అయితే ఇటీవల ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్ధనలకు వెళ్లిన వారు ఈ భైంసాలో కూడా ఉన్నారు.

 

అందుకే ప్ర‌భుత్వం ఈ ప‌ట్ట‌ణాన్ని హాట్ స్పాట్‌గా గుర్తించింది. ఇలాంటి చోట్ల మ‌రింత క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లు కావాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక్కడ మాత్రం స్థానిక ప్రజలు ప్రభుత్వం విధించిన ఆంక్షలను పట్టించుకోవడం లేదు. ఎవ‌రికి వారు ఇష్ట‌మొచ్చిన‌ట్టు రోడ్ల‌మీద‌కు వ‌చ్చేస్తున్నారు. లాక్ డౌనా ?  గీక్ డౌనా ? అన్న‌ట్టుగా ఇక్క‌డ ప్ర‌జ‌లు ఉన్నారు. ప్ర‌జ‌లు అంద‌రూ నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఇష్ట‌మొచ్చిన‌ట్టు రోడ్ల‌మీద‌కు వ‌స్తున్నా పోలీసులు.. అధికారులు మాత్రం చోద్యం చేస్తూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

 

వాస్తవానికి హాట్‌స్పాట్ కేంద్రాలలో రోడ్లపై ఒక్క వాహనం కూడా తిరగకూడదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీచేసినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ఇక్క‌డ ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే క‌రోనా కోరలు చాచ‌డంతో పాటు మ‌రికొంత మందికి ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: