గడచిన 24 గంటల్లో మన భారత దేశంలో కొత్తగా 505 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవ్వడానికి కారణం... తబ్లీజీ జమాత్ వేడుకలో పాల్గొన్నవారే అని స్పష్టమవుతుంది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే చిన్నపిల్ల వాడికైనా అర్థమయ్యేది ఏంటంటే... తబ్లీజీ జమాత్ వేడుకలకి వెళ్ళినవారు మంచివారే(ఎవరూ కావాలనే ప్రాణాంతక వైరస్ సోకాలని కోరుకోరు కదా) . కానీ 'కరోనా వైరస్ మన ముందు ఒట్టి బచ్చా. మన అల్లా మనందరినీ రక్షిస్తాడు. కరోనా లాంటి కోట్ల వైరసులు కూడా మనల్ని తాకలేవు' అని వారిని బ్రెయిన్ వాష్ చేసిన సదరు సంస్థ యొక్క నిర్వాహకులే ఇప్పుడు మన దేశానికి శత్రువులు. వారు అలా చెప్పడం వల్లనే ఢిల్లీ యాత్రకు వెళ్లిన వారంతా తమ ట్రావెలింగ్ హిస్టరీని దాచిపెట్టి 'మనకు అల్లా ఏం అవ్వనివ్వడు' అనుకుంటూ ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. కానీ అలా అనుకున్న వారికే ఇప్పుడు కరోనా వైరస్ సోకింది. ఫలితంగా భారతదేశం మొత్తం ఎంతో భయంకరమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత 24 గంటల్లో అమెరికా స్పెయిన్ లాంటి దేశాల్లో నమోదైనట్టు మన దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు భయం కల్పించేలా పెరిగిపోతున్నాయి.


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం... ఇప్పటివరకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3, 577 చేరుకోగా... కరోనా మరణాల సంఖ్య 83 కి చేరుకుంది. మహారాష్ట్రలో ఏకంగా 690 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబాయి నగరంలో కొత్తగా 29 కేసులు నమోదు కాగా... పూణేలో 17, పింప్రి-చిన్చ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ 4, అహ్మద్ నగర్ లో 3, ఔరంగాబాద్ 2 కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 4 పాజిటివ్ కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 26కి చేరుకుంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో నలుగురు కోవిడ్ 19 వ్యాధి నుండి కోలుకున్నారు.

 

ఇలా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సమయంలో... ప్రధాని నరేంద్ర మోడీ... మాజీ ప్రెసిడెంట్స్ ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ... అలాగే మాజీ ప్రధానులైన అయిన మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవేగౌడ... ఇంకా ఇతర పార్టీ వారైనా సోనియా గాంధీ ములాయం సింగ్, కే చంద్రశేఖరరావు(KCR), ఎంకే స్టాలిన్ మాయావతి తదితర వారికి ఫోన్ చేసి కోవిడ్ 19 ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు గురించి చర్చించారు. ఏది ఏమైనా కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు కేవలం లాక్ డౌన్ మాత్రమే కాకుండా వేరే ఏదైనా సమర్థవంతమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు వైద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అందరికీ మతపరమైన ప్రార్థనలు వాయిదా వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా తప్పని పరిస్థితుల్లో సమాజం కోసం కొన్ని రోజుల పాటు గుడికి గాని చర్చికి గానీ మసీదు గానీ వెళ్లకపోతే మనల్ని శిక్షించడానికి దేవుడు ఏమి శాడిస్ట్ కాదు కదా. 

మరింత సమాచారం తెలుసుకోండి: