తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు హీరో అయిపోయారు. సోష‌ల్ మీడియా ద్వారా త‌న దృష్టికి వ‌చ్చే విష‌యాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న ఎంత వేగంగా స్పందిస్తూ ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ స‌మ‌స్య‌ల నుంచి ఎన్నో విష‌యాల్లో ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌జ‌ల‌కు ఎంతో చేరువ అయ్యారు. ఇక తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశ‌, విదేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు ట్విట్ట‌ర్ ద్వారా కేటీఆర్ దృష్టికి స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రిస్తూ తిరుగులేకుండా దూసుకుపోతున్నారు.

 

తాజాగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తోన్న వేళ చాలా మంది తాము ప‌డుతోన్న బాధ‌ల‌ను ట్విట్ట‌ర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకురాగా ఆయ‌న వాటిని వెంట‌నే ప‌రిష్క‌రిస్తున్నారు. ఇక క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ప‌డుతోన్న బాధ‌లు అన్నీ ఇన్నీ కావు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌లోని వెంగళ్రావునగర్‌లో ఓ పాపకు పాలు కావాలంటూ మంత్రి కేటీఆర్‌కు ఓ యువకుడు అర్థరాత్రి ట్వీట్ చేశాడు.

 

ఈ ట్వీట్ చూసిన కేటీఆర్ వెంటనే స్పందించి.. డిప్యూటీ మేయర్‌కు సమాచారం ఇచ్చిన కేటీఆర్..అర్థరాత్రి సమయంలో పాపకు పాలు అందించారు. దీంతో ఆ యువ‌కుడు కేటీఆర్‌ను ఆకాశానికి ఎత్తుతూ మీలాంటి రాజ‌కీయ నేత‌ను ఎక్క‌డా చూడ‌లేదంటూ ఆకాశానికి ఎత్తుతూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఏదేమైనా సోష‌ల్ మీడియా ట్విట్ల‌కు స్పందిస్తూ ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తోన్న కేటీఆర్‌కు మ‌న‌మంద‌రం ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: