రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా బంధాలు అనుబంధాలు అనేవి కూడా మర్చిపోతున్నారు. కొంచెం కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే చాలు కన్న  వారైనా కట్టుకున్న వారైనా దూరం పెడుతున్నారు. కొంచమైన కనికరం కూడా చూపించడం లేదు. కరోనా  వైరస్ రావడం దేవుడెరుగు కనీసం దగ్గినా తుమ్మినా కూడా పరిస్థితి మరింత ఘోరంగా మారిపోయింది. కారణం  రోజురోజుకు దేశంలో పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పక్కన వారు ఒక్కసారి దగ్గారు  అంటే చాలు వారికి ఆమడ దూరం పారిపోతున్నారు. 

 

 

 ఒకప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే సడన్గా తుమ్మితే సత్యం అనే వారు... కానీ ఇప్పుడు మాత్రం పక్కన ఎవరైనా తుమ్మినా దగ్గినా చచ్చాం రా బాబు అంటూ పరుగులు తీస్తున్నారు. అంతలా ప్రజల్లో కరోనా వైరస్ భయం పెరిగిపోతుంది. ఈ వైరస్కు ఎలాంటి విరుగుడు  కూడా లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం కావడం ప్రజల్లో మరింత భయాందోళనకు కలిగిస్తుంది. దీంతో ప్రజలు  పక్కనే ఉన్నవారు ఎవరికైనా జ్వరం వచ్చినా లేదా దగ్గినా తుమ్మినా కూడా ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. ఇంకొంతమంది అయితే కన్న తీపి ని కూడా మరిచి పోతున్నారు. 

 

 

 ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన జరిగింది. కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కు ధరించి లేదు అన్న కారణంతో కన్న కొడుకునే చంపేసాడు కసాయి తండ్రి. కనీసం కనికరం  కూడా లేకుండా దారుణంగా చంపాడు. ఈ దారుణ ఘటన కలకత్తాలో చోటుచేసుకుంది. షోవ బజార్ కు చెందిన బన్సీధర్ మల్లిక్(78) కుమారుడు శిరుషేందు  మల్లిక్(45) వికలాంగుడు. ఈ క్రమంలోనే కొడుకు ఇంట్లో  బయటకు వెళ్తూ ఉండగా మాస్కు ధరించాలి అని తండ్రి కోరాడు. కానీ అందుకు కొడుకు మాత్రం నిరాకరించాడు. ఈ క్రమంలోనే తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఇక ఈ వాగ్వాదం కాస్త చిలికి చిలికి గాలి వానలా మారింది. దీంతో తండ్రి కొడుకు గొంతు బిగించడంతో ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయాడు కొడుకు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: