నవ్యాంధ్రప్రదేశ్ లో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు చేసిన అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జన్మభూమి కమిటీల పేరుతో ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు చేసిన అవినీతి అంతాఇంతా కాదు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం టీడీపీ అక్రమాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. రాజధానిని ప్రకటించక మునుపే టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేయడం, టెండర్లలో నిబంధనలు మార్చి దోపిడీకి శ్రీకారం చుట్టడం, ఇతర అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 
 
టీడీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మించగా ఆ భవనాలు తేలికపాటి వర్షం కురిస్తే పగుళ్లు వచ్చే భవనాలుగా, నాసిరకం భవనాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆ భవనాలకు కూడా టీడీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు అదనపు చెల్లింపులు చేయడం గమనార్హం. ఐదేళ్లూ కమీషన్లే లక్ష్యంగా సాగిన చంద్రబాబు పాలన ప్రస్తుతం అవే ఆలోచనలతో ఆరోపణలు చేస్తూ ఉండటం గమనార్హం. 
 
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా పరీక్షల కోసం కొనుగోలు చేసిన ర్యాపిడ్ కిట్ల ధరపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఇష్టానుసారం ఆరోపణలు చేసి ప్రజల్లో అనుమానాలు పెంచారు. వైసీపీ అత్యంత పారదర్శకంగా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొనుగోలు చేసినా కమీషన్లే లక్ష్యంగా కిట్లు కొనుగోలు చేసిందని ఆరోపణలు చేశారు. ఏపీలో జగన్ పాలన చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ఇలాంటి చౌకబారు ఆరోపణలు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 
 
వైసీపీ నేతలు ఏ రాష్ట్రానికైనా తక్కువ ధరకు సరఫరా చేస్తే అదే ధర చెల్లిస్తామని షరతు విధించామని... అందుకు ఆ కంపెనీ కూడా అంగీకరించిందని చెబుతున్నా టీడీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో హైదరాబాద్ కే పరిమితమైన చంద్రబాబు, రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయని టీడీపీ నేతలు ఇప్పుడూ కమీషన్ల ఆలోచనలతోనే వైసీపీపై ఆరోపణలు చేస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: