ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మరోసారి వైసీపీ నేతల టార్గెట్ అయ్యారు. ఇటీవల ఆయన హైదరాబాద్ లోని తన నివాసం సమీపంలో రోడ్డుపై చక్కర్లు కొడుతున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా ఈ వీడియోలపై కామెంట్లు చేస్తున్నారు. తమ ప్రభుత్వంపై వచ్చే విమర్శలను తిప్పికొట్టే క్రమంలో టాపిక్ ను లోకేశ్ మీదకు మళ్లిస్తున్నారు.

 

 

విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కరోనా నియంత్రణ విషయంలో ఏపీ ప్రభుత్వం సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో చిత్తశుద్ధితో పని చేస్తూ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంటే ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నాయని గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణ ఏం చెబితే అదే విషయాన్ని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు.

 

IHG

 

ఆయన ఇంకా ఏమన్నారంటే..” ప్రతి రోజు కరోనా నివారణకు అధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షా సమావేశం జరుపుతూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చక్కటి పరిపాలన అందిస్తున్నా ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి.చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ లో కూర్చుని ఆటలు ఆడుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు.. కాలక్షేపానికి భజన పరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. వాటిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

 

 

" చంద్రబాబు హయాంలో ప్రతి పనిలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. లోకేష్ లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడుతూ అచ్చోసిన ఆంబోతులాగా మాస్కులు లేకుండా తిరుగుతుంటే ఎల్లో మీడియా ఏం చేస్తోంది. రాష్ర్టాన్ని అప్పులపాలు చేసి తన పిప్పి పన్ను చికిత్స కోసం సింగపూర్ వెళ్లి ప్రభుత్వ సొమ్మును దోచుకున్న యనమల రామకృష్ణుడు ఈరోజు నీతులు మాట్లాడుతుంటారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: