లాక్ డౌన్ మే నెలాఖరు వరకు కొనసాగడం ఖాయం అన్నసంకేతాలు వస్తున్న పరిస్థితులలో జవహర్ లాల్ నెహ్రు సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ సైంటిఫిక్ రిసర్చ్ అంచనాల ప్రకారం దేశంలో మే 15 నాటికి మనదేశంలో కరోనా బాధితుల సంఖ్య 30 లక్షలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదు అంటూ ఒకప్రముఖ తెలుగు దినపత్రిక ఈరోజు తన కథనంలో షాకింగ్ విషయాలను ప్రచురించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ప్రజల జీవనశైలి లో అనేక అనూహ్యమైన మార్పులు వస్తున్నాయని చాలామంది పగటిపూట ఎక్కువగా నిద్రపోతూ రాత్రి ఎక్కువసేపు ఆలోచిస్తూ మేల్కొని ఉంటున్నారు అన్న ఆసక్తికర విషయాలను తెలియచేసింది. 


ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు అమ్మాయిలు అబ్బాయిలు తమ అభిప్రాయాలను ఆలోచనలను పంచుకునే స్నేహితులు అందుబాటులో లేకపోవడంతో అన్ని విషయాలు తల్లితండ్రులు చెప్పుకోలేక కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతోంది అంటూ ఆపత్రిక  కథనం. ముఖ్యంగా పిల్లలు ఉద్యోగాలు చేసే యువతీ యువకులు తమ స్కూల్స్ లో ఆఫీసుల్లో గడిపే సరదా సమయం మిస్ అయిందని భావిస్తూ ఒకవిధమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోయి అంతర్ముఖులు గా మారుతున్నారని ప్రముఖ మానసిక వైద్యులు చెప్పిన అభిప్రాయాలను ఆ కథనంలో ప్రముఖంగా ప్రచురించారు.


దీనితో పిల్లలు చాలామంది తమకి ఆకలిగా లేదు అంటూ సరిగ్గా అన్నం కూడ తినడం లేదనీ దీనితో ఖంగారు పడుతున్న తల్లితండ్రులు ఆన్ లైన్ లో మానసిక వైద్యులతో సంప్రదించడం చాల ఎక్కువైంది అంటూ అనేక ఆశ్చర్యకర విషయాలు ఆకథనంలో వెలుగు చూస్తున్నాయి. ఇలా పిల్లలు మారిపోవడానికి కారణం ఎప్పుడు ఏమి తినాలి ఏ టైమ్ లో నిద్రపోవాలి ఎన్ని సార్లు చేతులు కడుక్కోవాలి అన్న విషయాల పై తరుచు తమ తల్లితండ్రుల ఆంక్షలు తట్టుకోలేక చాలామంది పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు అన్నవిషయాన్ని ఆ కథనం తెలియచేస్తోంది. దీనితో చాలామంది పిల్లలు లాక్ డౌన్ సమయాన్ని ఒక శిక్షలా భావిస్తున్నారని ఇలాంటి ఆలోచనలు ప్రబలితే రేపటితరం మానసిక స్థితి పై కరోనా తీవ్ర ప్రభావం చూపెడుతుంది అంటూ అనేక మంది మానసిక వైద్యులు అభిప్రాయపడుతున్నారు..   

మరింత సమాచారం తెలుసుకోండి: