వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ  సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు, ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్షాలు కేవలం రాజకీయాల పైన దృష్టి పెట్టి యధావిధిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అభాసుపాలవుతున్నారు. ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తూ జగన్ ను, ఆ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం విమర్శలు చేస్తూ ఉండటం ప్రజల్లోకి బలంగా వెళుతోంది. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడడంపై ఆ పార్టీపై విమర్శలు పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ కరోనా వైరస్ వ్యవహారంలో మీడియాతో మాట్లాడుతూ  మరి కొంత కాలం పాటు ఈ వైరస్ తో సహజీవనం చేయాల్సి ఉంటుందని చెప్పారు. అంతేకాదు ఈ వైరస్ ఇప్పట్లో వదిలేది కాదని చెప్పారు. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. 

 

IHG
జగన్ సీఎం పదవిలో ఉండి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, బాబుతో పాటు ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. అయితే ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇలా అందరూ ఇదే విషయాన్ని చెప్పడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల నోళ్లు మూతపడ్డాయి. ఏపీ ప్రభుత్వాన్ని, జగన్ వ్యాఖ్యలను తప్పు పడితే కేసీఆర్ రియాక్షన్ తెలంగాణ వస్తుందన్న భయంతో తెలుగు తమ్ముళ్లు అంతా ఒక్కసారిగా ఈ విషయంలో సైలెంట్ అయిపోయారు. ఇక మద్యం విషయంలోనూ ఇదే చేదు అనుభవం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎదురైంది. ఏపీలో మద్యం దుకాణాలు తెరవడంతో పెద్ద ఎత్తున జనం క్యూలు కట్టారు. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ టిడిపి నాయకులు జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

 

IHG


 వైరస్ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాల్లోనూ  మద్యం షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వడం, తెలంగాణలోనూ రేట్లు పెంచి రెడ్ జోన్ లలో సైతం మద్యం షాపులు ఓపెన్ చేసినా, తెలుగుదేశం పార్టీ ఒకసారి సైలెంట్ అయిపోయింది. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వంపై మరోసారి గట్టిగా విమర్శలు చేద్దామంటే, తెలంగాణలో గట్టి రియాక్షన్ ఎదురవుతుందనే భయంతో ఈ విషయంలోనూ తెలుగు తమ్ముళ్ళు యూటర్న్ తీసుకున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ జగన్ అభాసుపాలు చేద్దామని చూస్తూ చివరకు తామే అభాసుపాలవ్వడంతో, అనవసరంగా తొందర పడుతున్నామనే భావన టిడిపి నాయకుల్లోనూ, అధినేత చంద్రబాబులోనూ వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. 

 

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల సీఎం లు ఇద్దరూ దాదాపు ఒకేరకంగా మాట్లాడుతూ, ఒకేరకమైన అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వాన్ని విమర్శలు చేసేందుకు ముందుకు వస్తున్న టీడీపీ, జనసేన అదే విషయంలో కేసీఆర్ ను విమర్శించే సాహసం చేయలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: