విశాఖ లో ఎల్ జి పాలిమర్స్ లో విష వాయువు లీక్ అయిన ఘటనలో  ప్రమాద బాధితులను పరామర్శించి రాజకీయంగా మైలేజ్ పొందడంతోపాటు, ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే అవకాశం చంద్రబాబు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులో ఇంటికే పరిమితమై పోవడంతో విశాఖకు వెళ్లి రాజకీయంగా లబ్ధి పొందే అవకాశాన్ని చేజార్చుకున్నారు. ప్రస్తుతం కరోనా కారణం గా ఎక్కడి వారిని అక్కడే ఉండాలి అంటూ నిబంధనలు ఉన్నాయి. ఏపీ ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు  విశాఖకు వెళ్లి హడావుడి చేయాలని నిశ్చయించుకున్నారు. అయితే ఏపీ, తెలంగాణలోనూ తనకు రాజకీయ బద్ద శత్రువులైన వైయస్సార్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ ప్రభుత్వాలు ఉండడంతో ఆయన వారి అనుమతి పొందేందుకు నామోషీగా ఫీలయ్యారు. 
 
 
 
దీంతో కేంద్రం అనుమతి తో ఏపీకి వెళ్లాలని ఆయన స్కెచ్ వేశారు. కేంద్రం మాత్రం చంద్రబాబు రాసిన లేఖను పట్టించుకోలేదు. గత కొంతకాలంగా చంద్రబాబు అదేపనిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ని పొగుడుతూ వస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టకుండా బిజెపికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను రాసిన లేఖకు కేంద్రం వెంటనే స్పందిస్తుందని బాబు ఆశ పడ్డారు. కానీ ఆ అవకాశం ఆయనకు కు దక్క లేదు. దీనికి కారణం లేకపోలేదు. ఇప్పటికే ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విశాఖపట్నం వెళ్లి బాధితులను పరామర్శించారు. దీనికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చంద్రబాబు మాత్రం ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను వేసుకోవాల్సి ఉండడంతో ఆయన కేంద్రానికి లేఖ రాశారు.
 
 
 
 చంద్రబాబు కు పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణాలు చాలానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరి లో ఉన్నారు. ఆయన బయలుదేరితే ఆయన వెంట కనీసం 30 మంది వరకు సెక్యూరిటీ కావాలి. వీరే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది విశాఖలో ఆయన వెంట పర్యటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో చంద్రబాబు పర్యటనకు అనుమతిస్తే అనవసర విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో కేంద్రం ఆయన రాసిన లేఖను పట్టించుకోనట్టు తెలుస్తోంది. అంతేకాకుండా చంద్రబాబు వయసు కూడా 70 సంవత్సరాలు ఉండడంతో ఆయనకు కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో పాటు చంద్రబాబు విశాఖకు వెళ్లేందుకు ప్రత్యేకంగా ఒక విమానాన్ని సమకూర్చాలని ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర సేవలు మినహా విమాన సేవలు నడవడం లేదు. కానీ చంద్రబాబు విశాఖ పర్యటనకు అనుమతిస్తే లేనిపోని గందరగోళం తలెత్తుతుందనే ఆలోచనతో కేంద్రం ఆయన లేఖను పరిగణలోకి తీసుకోనట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: