ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ కు ఎలాంటి వాక్సిన్  కూడా అందుబాటులో లేకపోవడంతో నివారణ ఒక్కటే మార్గం అయింది. నివారణలో ముఖ్యంగా పాటించాల్సింది  సామాజిక దూరం. మనిషికి మనిషికి మధ్య దూరం ఉంటేనే ఈ మహమ్మారి వైరస్ నివారించడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో రోజురోజుకు షేక్ హ్యాండ్ కనుమరుగైపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎవరు షేక్హ్యాండ్ తీసుకోవడం లేదు.. అలా షేక్ హ్యాండ్  తీసుకోవడానికి భయపడుతూ వస్తున్నారు. 

 

 అయితే తాజాగా షేక్ హ్యాండ్ కు సంబంధించి బీబీసీ  రాసిన న్యూస్ మాత్రం ఆసక్తికరంగా ఉంది అంటున్నారు విశ్లేషకులు. మన సంస్కృతి గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పని  బిబీసీ ప్రస్తుతం సనాతన సంస్కృతి గురించి మాత్రం గొప్పగా చెబుతూ ఒక వార్త రాసింది. ఇంతకీ బిబిసి ఏం రాసింది అంటారా.. కరోనా  వైరస్ కారణంగా ఆత్మీయ పలకరింపు అయిన  కరచాలనం దూరమవుతుంది.. వేలాది ఏళ్ళుగా వస్తున్న  ఆత్మీయ పలకరింపు కనుమరుగు  అవుతుంది.. ఇక ఈ కరచాలనాన్ని  ఇప్పటికిప్పుడు మర్చిపోవటానికి  యావత్ ప్రపంచం సంఘర్షణ పడుతుంది... చిన్న పెద్ద అనే తేడా లేకుండా... కలిసినప్పుడు విడిపోయినప్పుడు ప్రతి సందర్భంలో ఇలా షేక్ హ్యాండ్  చేయడం ప్రస్తుతం అందరిలో కలిసిపోయిందని కానీ ప్రస్తుతం కరోనా  వైరస్ కారణంగా శఇది  భవిష్యత్తులో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది అంటూ బిబిసి ఓక వార్త ప్రచురితం చేసింది.

 


 అయితే ప్రస్తుతం భారతదేశంలో కరచాలనాన్ని  దూరం పెట్టి ఇప్పుడిప్పుడే భారత సంప్రదాయమైన నమస్కారం అలవాటు చేసుకుంటున్నారు. అయితే నమస్కారం కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఎన్నోసార్లు పరిశోధకులు కూడా చెప్పారు. అయితే ఇలాంటి భారత సంప్రదాయం గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పిన బిబీసీ.. షేక్ హ్యాండ్  గురించి మాత్రం తెగ ఫీల్ అయిపోతుంది అంటూ చెబుతున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: