చైనా దేశం వల్ల భారతదేశం నష్టపోయింది ఏమిటి.. ఈ ప్రశ్నకు విశ్లేషకులు నుంచి ఎన్నో సమాధానాలు వస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ప్రశ్నకి  ఒక విశ్లేషకుడు చెప్పిన వ్యాఖ్యలు  ఏమిటి అంటే... ప్రపంచ దేశాల్లో మన దేశ వస్తువులను కూడా అమ్ముతున్నారు. ఇచ్చి పుచ్చుకోవటం  సమాన స్థాయిలో వ్యాపారం కొనసాగుతోంది. కానీ చైనా దేశం మాత్రం ఎప్పుడెప్పుడు భారత పరిశ్రమలను తనవైపుకు తిప్పుకుని తమ వ్యవస్థలను భారత్లో స్థాపించాలనే ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు విశ్లేషకులు.  భారత్లోనే ఒక్క వస్తువు రంగాన్ని వ్యూహాత్మకంగా భారత్ నుంచి లాగేసుకుంది చైనా. 

 


 దీంతో క్రమక్రమంగా భారతీయ పరిశ్రమల మొత్తం ఆక్రమిస్తూ చైనా భారత్ లో భారత్ కే  స్థానం లేకుండా చేస్తుంది. ఒకప్పుడు వస్త్ర ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. ఇక భారతీయ రైతులు పండించే పత్తి ధర క్వింటాలుకు నాలుగు వేల పైన ఉండగా.. 2013లో ఏకంగా క్వింటాలుకు 7000 రూపాయలు చెల్లించి పూర్తిస్థాయిలో పత్తిని ఎగుమతి చేస్తుంది. దీంతో వస్త్ర పరిశ్రమకు పత్తి దొరకకుండా చేయడంతో వస్త్ర పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. 

 

 ప్రతి దేశ మార్కెట్లలో చైనా ప్రవేశించి తమ దేశ వస్తువులను తక్కువధరకు అక్కడి స్వదేశీ వస్తువులను మార్కెట్లో లేకుండా చేయడం లాంటివి చేస్తుంటారు. ఇంతేనా అంటే ఇక్కడితో ఆగలేదు భారత్లో సైకిల్ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్న వారు ఎంతో మంది . ఇక సైకిల్ లోని అన్ని భాగాలు చైనా నుంచి రావడంతో తక్కువ ధరకు లభించడం వల్ల ఏకంగా పంజాబ్ రాష్ట్రంలో వందల సైకిల్ పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఎన్నో కుటుంబాలు ఉపాధి లేక విల విల లాడి పోయాయి . ఈ సమయంలో అటు చైనా మార్కెట్ మాత్రం పెరిగిపోయింది. 

 


 అంతేకాకుండా భారత్లోనే ట్రక్కులు కార్లకు కావల్సిన టైర్లు.. తక్కువ ధరకు డంపింగ్ చేసి  ఎలాంటి వారంటి  లేకుండా తక్కువ ధరకు అమ్మడంతో చైనా టైర్లు వైపే  ఎక్కువ మొగ్గు చూపారు ప్రజలు దీంతో భారతదేశంలోని స్వదేశీ టైర్ల పరిశ్రమలు కూడా పూర్తిస్థాయిలో మూతపడ్డాయి. ఇక సోలార్ ప్యానల్ విషయంలో కూడా ఇలాంటి  వ్యూహం అమలు  చేయడం ద్వారా విప్రో లాంటి సంస్థలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి . అయితే సామ్రాజ్యవాద ధోరణి అని చెప్పేటూవంటి చైనా.. మనదేశంలో చేసేది కూడా సామ్రాజ్యవాదం అంటున్నారు విశ్లేషకులు. చైనా ద్వారా భారత్ ఎంత మేరకు నష్టపోయింది అనే విషయం ఈ కింది వీడియోలో మరింత క్లుప్తంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: