చిత్తూరు జిల్లా న‌గ‌రి ప్రొటోకాల్ వివాదం చినికి చినికి గాలి వాన‌లా మారుతోంది. ముందుగా త‌న‌కు చెప్ప‌కుండా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో డిప్యూటీ ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామితో పాటు స‌త్య‌వేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా వ‌చ్చార‌ని.. ఆ టైంలో తాను ఇంట్లో ఉన్నా త‌న‌కు చెప్ప‌కుండా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌డం ఏంట‌ని రోజా మండి ప‌డిన సంగ‌తి తెలిసిందే. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని పుత్తూరు ప‌ట్ట‌ణంలో ఉన్న ఎస్సీ, ఎస్టీల క‌ళ్యాణ మండ‌పం, క‌మ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థ‌ల ప‌రిశీల‌న కోసం తాము ప‌ర్య‌టించామ‌ని నారాయ‌ణ స్వామి చెపుతున్నారు. దీనిపై రోజా ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. 

 

దీంతో అంబేడ్క‌ర్ ట్ర‌స్టు స‌భ్యులు రోజాను క‌లిశారు. ట్ర‌స్ట్ భ‌వ‌నాల నిర్మాణానికి స‌హ‌క‌రించాల‌ని వారు కోరారు. దీంతో రోజా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు చెప్ప‌కుండా మంత్రి, ఎమ్మెల్యే ప్ర‌శ్నించ‌డం ఏంట‌ని గుస్సా అయ్యారు. దీనికి ప్ర‌తి గా నారాయ‌ణ స్వామి కూడా స్పందించారు. తాను డిప్యూటీ సీఎం అని.. తాను ఎవ్వ‌రికి చెప్పి వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని.. తాను మంత్రిగా ఎక్క‌డికి అయినా వెళ్ల వ‌చ్చని ఘంటా ప‌థంగా చెప్పారు. అయినా రోజా కూడా త‌మ‌కు సోద‌రి లాంటి వారే అన్న నారాయ‌ణ స్వామి... తాను జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా, ఎమ్మెల్యేగా గ‌తంలో అంద‌రికి న‌మ‌స్కారాలు పెట్టుకుంటూ వెళ్లిన విష‌యం అంద‌రికి తెలిసిందే అని చెప్పారు.

 

ఇదిలా ఉంటే రోజాను వైసీపీలో రాజ‌కీయంగా అణగ దొక్కే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా ? అంటే వైసీపీ రాజ‌కీయ వ‌ర్గాల్లోనే అవును ఆనే ఆన్స‌ర్లే వినిపిస్తున్నాయి. ముఖ్‌యంగా రోజా ను రాజ‌కీయంగా ఇబ్బంది పెట్టేందుకు జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉన్న మంత్రే కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న చ‌ర్చ‌లు అయితే ఉన్నాయి. స‌ద‌రు మంత్రి ముందు నుంచి రోజాను తీవ్రంగా ఇబ్బంది పెట్ట‌డంతో పాటు ఆమెను ఆమె సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఇబ్బంది పెట్టేలా చ‌క్రం తిప్పుతున్నార‌న్న టాక్ కూడా ఉంది. దీనికి తోడు ఇప్పుడు నారాయ‌ణ స్వామి సైతం ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెకు చెప్ప‌కుండా వెళ్ల‌డాన్ని బ‌ట్టి చూస్తే రోజాను వైసీపీ వాళ్లే లైట్ తీస్కొంటున్న‌ట్టే క‌న‌పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: