తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో పాటు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా, ఆ పార్టీ పదవుల విషయంలో పెద్ద చిచ్చు రేగుతున్నట్టుగా కనిపిస్తోంది. కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవిని భర్తీ చేసే విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో కొంతమంది వ్యక్తుల పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్, ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇలా మరికొంత మంది పేర్లను పరిగణనలోకి తీసుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు ఏపీ టిడిపి అధ్యక్షుడుని ఎంపిక చేసే విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకోకపోయినా, ఈ వ్యవహారం మాత్రం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.

 

IHG


 తాజాగా ఈ విషయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబును కలిసి తనకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరినట్లు, దానికి సమాధానంగా అధ్యక్ష పదవిని యువనేతకు ఇవ్వాల్సిన అవసరం ఉందని, అందుకే ఆ పదవిలో వారినే కూర్చోబెట్టాలని చూస్తున్నానని చంద్రబాబు నానికి చెప్పారట. ఇక గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా పార్టీ అధ్యక్ష పదవిపై భారీగానే ఆశలు పెట్టుకున్నారని, టిడిపికి ఎదురు గాలి వీచినా గుంటూరులో తాను విజయం సాధించానని, ఇప్పుడు తనకు పార్టీ అన్యాయం చేస్తోంది అనే భావన ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. 

IHG's Move to Hold ...


టిడిపి అధ్యక్షపదవిని పొందే విషయంలో ఇద్దరి నాయకులు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారనే వార్తల నేపథ్యంలో చంద్రబాబు వారిని బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీలో అధ్యక్ష పదవి విషయంలో పెద్ద రాద్ధాంతం  జరిగేలా కనిపిస్తోంది. చంద్రబాబు మాత్రం సమర్ధుడైన యువ నాయకుడుకి ఆ పదవి కట్టబెట్టాలని, రానున్న నాలుగేళ్లలో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటూ, పార్టీని ముందుకు నడిపించగల సత్తా ఉన్న వారిని ఎంపిక చేయాలని, ఈ విషయంలో ఎటువంటి మొహమాటాలకు వెళ్ళకూడదని, అలా వెళితే పార్టీ భవిష్యత్తు చేతులారా నాశనం చేసినట్లు అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ముందు ముందు ఈ అధ్యక్ష స్థానాన్ని ఆశిస్తున్నా వారిలో ఎంతమంది అలక చెందుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: