ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఉన్న కేసులన్నీ బయటకు తవ్వే పనిలో ఉంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పటికే పలువురు నాయకులును విచారణకు పిలిపిస్తున్నారు. మరో పక్క ఇదంతా చూసిన టీడీపీ నాయకులు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం విధానాలు అమెలుచేస్తున్నారని. మీడియా ముందుకొచ్చి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే టీవీ5 న్యూస్ ప్రెజెంటర్ మూర్తి పై కేసు నమోదు చేశారు.

 

 

అయితే దీనిపై మూర్తి స్పందిస్తూ ఒక వీడియో ను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ...విచారణ పేరుతో తనను ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేధిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో మూర్తి విడుదల చేసిన వీడియో చర్చనీయాంశంగా మారింది. విచారణ పేరుతో పదే పదే తమని పిలుస్తున్నారని ఆరోపించారు. ఆ కేసు కు సంబంధించి బెయిల్ తెచ్చుకున్న తర్వాత కూడా  వారానికి మూడు, నాలుగు రోజులు విచారణ పేరుతో విజయవాడకు పిలిపించి.. ఖాళీగా కూర్చోబెట్టి పంపిస్తున్నారన్నారు.

 


కొన్నాళ్ల కిందట యూనివర్శిటీ పాలక మండళ్లను ఏపీ సర్కార్ నియమించింది. డానిక్ సంబంధించిన రహస్యాలను మాజీ న్యాయమూర్తి శ్రావణ్ టీవీ5 చర్చా కార్యక్రమంలో బయట పెట్టారు. అప్పుడా షో కి వ్యాఖ్యాతగా ఉన్న మూర్తి ఉన్నారు. ఇక డానిక్ సంబంధించిన కేసులో న్యాయమూర్తి శ్రావణ్ అలాగే టీవీ5 మూర్తి ,టీవీ5 యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దానికి సంబంధించి బెయిల్ తెచ్చుకున్న తర్వాత కూడా సహజ విచారణకు సహకరించాలని వారిని పదే పదే పిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మూర్తి. తన వృత్తి పరమైన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలు లేకుండా చేస్తున్నారనే మూర్తి ఆరోపించారు. అందువల్లే తన కార్యక్రమాలు తగ్గాయని అన్నారు.  విచారణకు ఎప్పుడైనా వెళ్లకపోతే సహకరించడం లేదని చెప్పి బెయిల్ క్యాన్సిల్ చేయించేదుకు ఇదొక వ్యూహమని ఆయన దుయ్యబట్టారు.  అందుకే పోలీసుల వేధింపుపై తాను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నానన్నారు. వాస్తవానికి తనది తప్పేమీ లేదని ఎం చేసిన న్యాయం నా పక్కనే ఉందని మూర్తి వీడియోలో స్పష్టంచేశారు. ఇవన్నీ అవాస్తవాలని ఏదైనా చట్ట ప్రకారమే జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: