దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కరోనా పేరు వినిపిస్తే చాలు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 30తో అన్ లాక్ 1.0 ముగియనుండటంతో అన్ లాక్ 2.0 గురించి అనేక సందేహాలు నెలకొన్నాయి. తాజాగా మోదీ ఆల్ పార్టీ మీటింగ్‌లో దశలవారీ లాక్ డౌన్ ముగిసిందని.. అన్‌లాక్ ప్రక్రియ మొదలైందని స్పష్టం చేశారు. 
 
జూన్ 30వ తేదీతో అన్‌లాక్ 1 ముగుస్తుండటంతో అన్‌లాక్ 2లో కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుందో చూడాల్సి ఉంది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు మరికొన్ని రోజులు మూసివేయాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో సుమారు 85 శాతం కరోనా కేసులు ప్రధాన నగరాల్లోనే నమోదవుతున్నాయి. మిగిలిన కేసులు మాత్రం ఇతర రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
దీంతో కేంద్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకునే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అన్‌లాక్ 2లో అంతర్జాతీయ విమాన సర్వీసులు పున: ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ జులై 15 వరకు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించినా కొన్నింటిని “కేస్-టు-కేస్” ప్రాతిపదికన అనుమతించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అన్‌లాక్ 2లో మాత్రం పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తిరిగి తెరిచే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అన్‌లాక్ 1.0, అన్‌లాక్ 2.0 మార్గదర్శకాల మధ్య తేడా ఉండే అవకాశం పెద్దగా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్‌లాక్ 2.0లో కేంద్రం మాత్రం ఎలాంటి మార్పులు చేయడానికి సిద్ధంగా లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కరోనా విషయంలో కొత్త మార్గదర్శకాలేమైనా జారీ చేస్తుందేమో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: