బీజేపీ సీనియర్ నేత  ఆలె నరేంద్ర గత కొంత కాలంగా నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు నేడు కన్నుమూశారు. హైదరాబాద్ లో టైగర నరేంద్ర అంటే తెలియనివారు ఉండరు. భారతీయ జనతా పార్టీలో ఉంటు ప్రజలకు, కార్యకర్తలకు ఆక్ష్న అందించిన సేవలు అభినందనీయమైనవి అందుకే ఆయను టైగర్ నరేంద్ర అని పిలిచేవారు. అయితే ఆయనకు గత కొంత కాలంగా ఆరోగ్య పరిస్థతి క్షీణించడం వల్ల ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఆలె నరేంద్ర తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో నాంపల్లి లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.  ఈయన వయస్సు 68 సంవత్సరాలు కాగా ఆలె నరేంద్ర మృతితో ఆయన అభిమానుల్లో ,కార్యకర్తల్లో విషాదం అలుముకుంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఆలె నరేంద్ర తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో నాంపల్లి లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు బిజెపి లో తెలంగాణా వాదిగా నిరంతరం శ్రమించిన నరేంద్ర తెలంగాణా కు ఆ పార్టీ కట్టుబడి ఉండక పోవడంతో పార్టీని వీడి తెలంగాణా సాధన సమితి పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అనంతరం కేసిఆర్ ఆహ్వానం తో తన పార్టీని తెరాస లో విలీనం చేసి మెదక్ పార్లమెంట్ కి పోటీ చేసి ఎంపి గా సేవలందించారు. తర్వాత కేసిఆర్ తో విభేదించి మళ్ళీ బిజెపి లో కొనసాగుతున్నారు. గత కొంత కాలంగా ఈయన అనారోగ్యంగా ఉండటం చేత రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. ఈ రోజు ఆరోగ్య పరిస్థతి శృతి మించగా ఆసుపత్రికి తరలించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: