శుక్రవారం తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు.. ఆయనకు చాలా మంది శుభాకాంక్షలు చెప్పారు. ఆయన కూడా ఎన్నో ప్రజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన పుట్టిన రోజు వేళ జనం చెప్పే ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు కేటీఆర్.. టీఆర్‌ఎస్‌లోని మిగిలిన నాయకులూ స్ఫూర్తినిచ్చారు. జనానికి ఉపయోగపడే ఆ నిర్ణయం ఏంటో తెలుసా...?

 

 


తన పుట్టినరోజు సందర్భంగా సొంత ఖర్చుతో ఓ ఆరు అంబులెన్సులను సమకూర్చారు కేటీఆర్.. తనపై ప్రేమ ఉన్న నాయకులు కూడా ఇదే తరహాలో నిర్ణయం తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. ఓ ఆదర్శమంతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  పార్టీ నేతగా తాను ఈ అంబులెన్సులు ఇస్తానని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరికీ ఉపయోగపడేలా ఉండేందుకు ఆరు అంబులెన్స్‌లను తాను వ్యక్తిగతంగా ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు. 

 

 


అంబులెన్స్‌లను కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చును తాను భరిస్తానని, పార్టీ తరఫున ఇవ్వాలనుకుంటున్నట్టు  కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో వాటిని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ అంబులెన్స్‌ల్లో అన్ని సౌకర్యాలుంటాయని, కరోనా టెస్టులు కూడా చేసే వీలుంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఉపయోగించుకోవాలని, అతి త్వరలోనే వీటిని అందజేస్తామన్నారు.

 

 


మంత్రి కేటీఆర్ స్పందించిన తీరుపై ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అభినందించారు. అంతే కాదు..  తాను కూడా తమ నియోజకవర్గం, కరీనంగర్ జిల్లా పార్టీ తరఫున 5 అంబులెన్స్‌లను సమకూరుస్తానని  చెప్పారు. ప్రభుత్వపరంగా అంబులెన్స్‌లను సమకూరుస్తున్నప్పటికీ వీటి అవసరం ఎక్కువగానే  ఉంటోందని, కరోనా టెస్టులను కూడా చేసేలా రూపొందించడంతో చాలా ఉపయోగం ఉంటుందన్నారు. ప్రతీ అంబులెన్స్‌లో అత్యవసర మందులతోపాటు ఆక్సీజన్, వెంటిలేటర్ వంటివాటిని కూడా ఏర్పాటు ఉంటుందని, వీటిని ఉపయోగించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో టెస్టులు చేయడానికి అవసరమైన సిబ్బంది అంబులెన్స్‌లలో ఉండేలా చూస్తామని ఆరోగ్య మంత్రి  చెప్పారు.

 

 


మంత్రి కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మరో మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి , రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి  స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ పక్షనేత నామా నాగేశ్వరరావు , మంత్రి గంగుల కమలాకర్, మంత్రి మల్లారెడ్డి .. ఇలా అంతా అంబులెన్సులు అందించేందుకు ముందుకొచ్చారు. మొత్తంగా రాష్ట్రంలోని 32 జిల్లాల్లో వంద అంబులెన్స్‌లు ఇచ్చేలా ప్రణాళిక సిద్దమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: