రోడ్డు నిబంధనలకు సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ సరి కొత్త రూల్స్ ని అమలులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవలే టూవీలర్ లకు సంబంధించిన సరి కొత్త రూల్స్ ని ప్రకటించింది కేంద్ర మంత్రిత్వ శాఖ. అయితే మొన్నటి వరకు వాహనానికి సంబంధించిన పత్రాలతో పాటు వాహనానికి పొల్యూషన్ చెక్ పత్రం ఉంటే సరిపోయేది... ఇప్పుడు మాత్రం వెనుక కూర్చున్న వారికి సౌకర్యవంతంగా ఉండేలా కొత్త రూల్స్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వాహనంపై వెనుక భాగంలో కూర్చున్నవారు సౌకర్యవంతంగా కూర్చుని... సపోర్టుగా పట్టుకునేందుకు ప్రతి వాహనానికి చేతి కడ్డీలు తప్పనిసరిగా ఉండాలని నిబంధన పెట్టింది.




అయితే ప్రస్తుతం ఇలాంటి చేతి కడ్డీలు ఏ వాహనానికి కూడా కనిపించడం లేదు. దీంతో ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో కొన్నిసార్లు వెనుక కూర్చున్న మహిళలు సైతం ప్రమాదానికి గురయ్యే దుస్థితి ఏర్పడుతుంది. అందుకే ఇలా వెనుక కూర్చున్న వారు పట్టుకోవడానికి చేతికడ్డీలు  తప్పనిసరిగా ఉండాలి అంటూ తెలిపింది, అంతేకాకుండా వెనుక భాగంలో కూర్చున్న వారు పాదాలను సౌకర్యవంతంగా పెట్టుకోవడానికి పెడల్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి అంటూ సరికొత్త రూల్  అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇలా పలు సరికొత్త రూల్స్ ని అమలులోకి తెచ్చింది కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. కొత్తగా తీసుకున్న వాహనం ఆర్టీవో కార్యాలయంలో రిజిస్టర్ చేయాలి అంటే ఇవన్నీ వాహనానికి  కలిగి ఉండాలి.



లేనిపక్షంలో వాహనం ఆర్టీవో ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయబడదు అంటూ స్పష్టం చేశారు జాతీయ రహదారుల శాఖ మంత్రి. అందుకే వాహనదారులు ఇప్పటికైనా అలర్ట్ గా ఉండి ప్రభుత్వం విధించిన నిబంధన ప్రకారం వాహనానికి అన్ని ఉండేలా చూసుకున్న తర్వాతనే ఆర్డీవో కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కి వెళ్లడం ఎంతో మేలు అని విశ్లేషకులు చెబుతున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: