ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి రావడమే ప్రమాదం అనుకుంటున్న సమయంలో ఇప్పుడు జరిగిన ఈ సంఘటన ఎంతో ఆశ్యర్యానికి గురిచేస్తుంది. సాటి మనిషి ఎదురుగా ఎంత దీనస్థితిలో ఉన్నా కనీసం పట్టించుకోకుండా పక్కనుండి నడుచుకొని వెళ్లే కలియుగ కాలం లో ఉన్నాం.అలాంటి ఈ రోజుల్లోనూ మీకు మేమున్నామంటూ కొందరు తమ సహకార చర్యలతో అక్కడ అక్కడ మెరుస్తుంటారు.ఇప్పుడు ఇలాంటి జాబితాలోనే చేరారు తాడికొండ mla ఉండవల్లి శ్రీదేవి.  ప్రస్తుతం సమాజంలో ఎదుటి వ్యక్తి నిస్సహాయ స్థితిలో పడి ఉన్న కరోనా  భయంతో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చూస్తూ ఉండిపోతున్నారు జనాలు.

  ఇలాంటి కంగారుపెట్టే  కరోనా టైంలో కూడా తోటి మనిషికి సహాయం చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు మన తాడికొండ mla శ్రీదేవి. ఇలాంటి ఈమెపై గతంలో లో పేకాట మాస్టర్ అంటూ,జూదాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే... అప్పట్లో విమర్శించిన ఎన్నో నోర్లు ఇప్పుడు ప్రశంసిస్తున్నాయి.ఇంతకీ అసలు విషయం ఏంటంటే రాజకీయ నాయకురాలిగా కంటే ప్రాణాలు పోసే డాక్టర్ గానే ఎక్కువ గుర్తింపు ఉన్న శ్రీదేవి గారు గుంటూరు నుండి పిడుగురాళ్ల కు వెళ్తుండగా మార్గమధ్యంలో రోడ్డుపై ఓ వ్యక్తి యాక్సిడెంట్ అయి పడి ఉండడం చూసి హుటాహుటిన కారు దిగి ప్రథమ చికిత్స అందించి మరి అంబులెన్స్లో హాస్పిటల్ కు పంపారట.

అంతేకాదు ప్రమాదం జరిగితే పట్టించుకోకుండా వేడుక చూస్తున్న అక్కడి ప్రజలకు మానవత్వం పై క్లాస్ తీసుకున్నారట. ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు తప్పక సాయం అందించాలి అంటూ హితబోధ చేశారు ఈ నేటి ఎమ్మెల్యే. హాట్సాఫ్ శ్రీదేవి గారు అంటున్నారు న్యూస్ విన్న నెటిజన్లు.  ఇదే స్పందన ప్రతి మనిషిలోనూ వస్తే దేశం బృందావనంలా  మారిపోతుంది అంటున్నారు కొందరు. మరి ఈ విషయాన్ని ఎంతమంది ఆదర్శంగా తీసుకుని ఎంతమందికి సహాయపడుతారో రానున్న రోజుల్లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: