అయితే సునీల్ బాటలోనే మరికొందరు పార్లమెంట్ అభర్ధులు టీడీపీీని వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో ఓడిన ఆడారి ఆనంద్ కుమార్, ఒంగోలు నుంచి ఓటమి పాలైన శిద్ధా రాఘవరావు, నెల్లూరు పార్లమెంట్ బరిలో ఓడిపోయిన బీదా మస్తాన్ రావులు బాబుకు షాక్ ఇచ్చి వైసీపీలో చేరారు. అటు కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. ఇక ఇప్పుడు సునీల్ కూడా పార్టీని వీడారు.
ఇంకా మరికొందరు నేతలు కూడా టీడీపీలో యాక్టివ్‌గా ఉండటం లేదు. వీరు కూడా జంప్ అయిపోవచ్చని ప్రచారం జరుగుతుంది. టీడీపీ గెలిచిన మూడు స్థానాలు శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు స్థానాలని పక్కనపెడితే మిగిలిన చోట్ల ఓడిపోయిన వారు పార్టీ మోహమే చూడటం లేదు. అయితే ఇందులో కొందరు పార్టీని వీడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయట. నరసాపురం పార్లమెంట్ స్థానంలో ఓడిన శివరామరాజు తన వ్యాపారాల కోసం వైసీపీలో చేరే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
అటు తిరుపతిలో ఓడిన పనబాక లక్ష్మీ, రాజంపేట డిఏ సత్యప్రభ, కర్నూలులో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు కూడా అటు ఇటు ఊగిసలాడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే టీడీపీ పార్లమెంట్ అభ్యర్ధులు బాబుకు గట్టి షాక్ ఇచ్చేలాగానే కనిపిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి