కరోనా ప్రతీ ఒక్కరినీ మహమ్మారై పట్టి పీడుస్తున్నప్పటి నుండి కూడా  ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ నుండి ఎక్కడికి కదల్లేదు. తాను అలానే హైదరాబాద్ లోనే ఉంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. కేవలం జూమ్ సమావేశాలు నిర్వహిస్తూ బాబు ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసినదే. అనేక సంఘటనలు రాష్టం లో జరుగుతున్నా  ప్రతిపక్షం లో ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవు.

ఇది ఇలా ఉండగా బాబు చాలా రోజుల తర్వాత అమరావతి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి  చంద్రబాబు రావటంతో అక్కడ ఉన్న  నాయకులు మీట్ అవ్వాలని అనుకున్నారు కానీ ఎవరినీ కలవకుండానే  మళ్ళీ హైదరాబాదు వెళ్లి పోవడం జరిగిందట. అక్కడ నుండి త్వరగా వెళ్లి పోవడానికి కారణం కరోనా భయం అని ఆఖరికి తెలిసింది. కేవలం అక్కడికి వచ్చి ఎందుకు వెళ్ళి పోయాడు......  దాని బదులు చంద్ర బాబు రాకుండా ఉంటేనే  మంచిది అనుకున్నారంతా. పోనీ ఆయనకు అంత భయం అయితే నారా లోకేష్ హైదరాబాదు లో ఉండి ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారట.

అంత ప్రాణ భయం ఉంటే ఎప్పటి లాగానే జూమ్ మీటింగ్లు నిర్వహించుకుంటూ పోతే సరి కదా అని  కార్యకర్తలు తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారట. ప్రతిపక్షం లో ఉన్న చంద్రబాబు ఇలా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోవడం పక్కా అని  టాక్ క్యాడర్ లో వినపడుతున్నట్లు అర్ధం అవుతోంది. దీనితో పార్టీకి మైలేజ్ ఎలా వస్తుందని సొంత నేతలే ఇప్పుడు బాబు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ చంద్ర బాబు ఇలా ఇంటికి పరిమితం అయి జూమ్ మీటింగ్ లు కండక్ట్ చేసిన ఎటువంటి ప్రయోజనాలు లేవు అని అంటున్నారు. తాను ఇలానే ఉంటే ప్రజలు అసలు బాబుని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: