గతంతో పోలిస్తే టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కాస్త ఎక్కువ చురుగ్గా కనిపిస్తున్నారు. మొన్నటి వరకు కరోనా భయం తో ఏపీలో అడుగుపెట్టేందుకు వెనుకడుగు వేసిన ఆయన, ఇప్పుడు వైసీపీ నేతలు, ప్రజలు తనపై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు నేరుగా రంగంలోకి దిగినట్టు కనిపిస్తున్నారు. మొదటగా అమరావతి లో అడుగు పెట్టిన చంద్రబాబు ఇక్కడ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటూ, పార్టీ నేతలతో ఆన్లైన్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తున్నారు.


 సరిగ్గా అదే సమయంలో లోకేష్ ఏపీ లో అడుగుపెట్టి,  అమరావతి పర్యటనలు చేస్తూ, పార్టీ నేతల్లో జోష్ పెంచేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో, తాను ఇంట్లోనే ఉంటూ, సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తూ ఉంటే, ప్రజల్లో తనపై నమ్మకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో లోకేష్ ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు  చేపట్టినట్లు సమాచారం. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన లోకేష్ ఇటీవల వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నీట మునిగి బాధలో ఉన్న రైతులను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 



వ్యవసాయ మంత్రి కన్నబాబు సొంత జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ... 60 మంది కి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. వర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. అసలు ఈ జిల్లాకు చెందిన వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నారు ? ప్రశ్నిస్తే నామీద వెటకారాలు చేస్తారు. వెటకారాలు మానేయండి .. నీళ్ళలోకి దిగి చూడండి అంటూ" సవాల్ విసిరారు.ఈ సందర్భంగా జగన్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ప్రజలను నిలువునా మోసం చేశారని, ముంపు ప్రాంతాల్లో పేదలకు భూమి ఇస్తామని చెబుతారా ? దాన్ని ప్రశ్నిస్తే మా మీద దాడి చేస్తారా ? మీరు ప్రజలకు ఇస్తానన్న భూములు ఇప్పుడు ఎక్కడ ? నీళ్ళల్లో కి దిగి చెప్పండి. మీరు ఏ భూములు ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: