దేశంలో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఒక రాష్ట్రం వరద బీభత్సం నుంచి కాస్త కోరుకుంటుంది అనుకునేలోపే వర్షాలు మరో రాష్ట్రంపై విజృంభించి వరదలతో ముంచెత్తుతున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో హైదరాబాద్ నగరం మొత్తం అల్లాడిపోయింది. ఎక్కడ చూసినా వరద నీరే  కనిపించింది. పెద్ద పెద్ద నదులు ప్రవాహాలు హైదరాబాద్ నగరంలోనే కనిపించాయి దీంతో కాలనీలలో వాహనాలతో కాకుండా ఏకంగా బోట్ల పై ప్రయాణించే దుస్థితి కూడా ఏర్పడింది. జనావాసాల్లోకి నీరు చేరుకోవడంతో అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.



 ఇప్పుడు వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి... వరదలు అందరినీ ముంచెత్తుతున్నాయి.. కానీ తేడా ఒక్కటే నగరం మారింది. నిన్నటి వరకు హైదరాబాద్ నగరాన్ని పట్టి పీడించిన భారీ వర్షాలు వరదలు ఇప్పుడు బెంగళూరు ను కూడా ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షంతో ఎక్కడ జనాలు అక్కడే జలదిగ్బంధంలో కి వెళ్లి పోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలని సాహసం చేస్తే వరద  ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం బెంగుళూరు నగరాన్ని  మొత్తం భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో నగర వాసులు అందరూ జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయారు.



 కుండపోతగా కురిసిన వాన బీభత్సం దాదాపు ఐదున్నర గంటల వరకు కొనసాగడంతో లోతట్టు ప్రాంతాలలో నీటితో నిండిపోయాయి. దీంతో వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని కాలనీలలో అయితే ఏకంగా పెద్ద పెద్ద నదులను తలపిస్తున్నాయి. ఇక బెంగళూరు నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ఎంత దారుణం పరిస్థితి నెలకొంది అన్న వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్న విషయం తెలిసిందే. దీంతో బెంగుళూరు నగర పాలక సంస్థ సిబ్బంది అధికారులు అందరూ వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టడంలో నిమగ్నమై పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: