వేడి పుట్టిస్తున్న తాజా అంశం..నిమ్మగడ్డకి లేఖ


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందనేది ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే. ఈ తరుణంలో ప్రభుత్వంలోని ఒ పెద్ద ఐఎఎస్ అధికారికి, ఎన్నికల కమిషన్ లోని ఓ ముఖ్య అధికారి (రిటైర్డ్ ఐఎఎస్) మధ్య ఏర్పడిన తాజా వివాదం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో ఈ నెల 28న సమావేశం నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. అయితే త్వరలో జరగనున్న పార్లమెంట్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 26వ తేదీ సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హజరుకావాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ పంపండం వివాదాస్పదం అయ్యింది. దీనిపై నిమ్మగడ్డ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటుగా సమాధానం పంపినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించే ఏ సమావేశాలకు తన అనుమతి లేకుండా వెళ్లవద్దని ఎన్నికల సంఘం కార్యదర్శిని ఆయన ఆదేశించారుట.

హైకోర్టు న్యాయమూర్తితో సమాన హోదా గల పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ కు జూనియర్ అధికారి సమావేశానికి హజరుకావాలని ఆదేశాలు జారీ చేయడం అభ్యంతరకరం అని ఇది బెదిరింపు ధోరణిలా ఉందంటూ నిమ్మగడ్డ..ప్రవీణ్ ప్రకాష్ కు ఘాటుగా లేఖ రాసినట్లు సమాాచారం. అయితే ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్ కు పంపాల్సిన లేఖ పొరపాటున ఎన్నికల కమిషనర్ కు వెళ్లిందని ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణుగుతుందో లేదో చూడాలి మరి.....ఈ నెల 28న సమావేశం నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించార.....

మరింత సమాచారం తెలుసుకోండి: