ఈ మధ్యకాలం లో ఎక్కడ చూసినా మహిళల పై అత్యాచార ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతూ  ఉన్నాయన్న విషయం తెలిసిందే.. కేవలం భారతదేశంలోనే కాదు వివిధ దేశాలలో కూడా మహిళలకు ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతుండడంతో మహిళల్లో ప్రశ్నార్ధక జీవితాన్ని గడపవలసిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలోనే మహిళలపై అత్యాచార ఘటనకు పాల్పడిన వారిని ఎక్కడికక్కడ శిక్షించాలి అంటూ ప్రస్తుతం ప్రజల నుంచి డిమాండ్లు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో భారత దాయాది దేశమైన పాకిస్థాన్లో కూడా మహిళలపై అత్యాచార ఘటనలు సంచలనం రేపుతున్నాయి.


 తరచూ ఎక్కడో ఓ చోట మహిళలపై అత్యాచార ఘటనలు తెర మీదికి వస్తూ ఉండటం  సంచలనంగా మారిన పోతుండగా అత్యాచార ఘటనలపై ప్రభుత్వ సైలెంట్ గా ఉండడం ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలోనే మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని నడిరోడ్డుపై శిక్షించాలి అంటూ గతంలో పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.



 ఆడపిల్లలపై అత్యాచారాలు కు పాల్పడిన నిందితులను రసాయనాల సహాయంతో నపుంసకులుగా మార్చేందుకు వీలు కల్పించే విధంగా సరికొత్త చట్టాన్ని తీసుకు వచ్చేందుకు... పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అంగీకారం తెలిపినట్లు ఇటీవలే పాకిస్థాన్కు చెందిన ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఇక దీనికి సంబంధించిన ముసాయిదాను కేబినెట్లో ప్రవేశపెట్టేందుకు పాకిస్థాన్ మంత్రి వర్గం కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు ఎక్కువ అవుతున్న తరుణంలో త్వరగా ఈ చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: