గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వెనుకబడి ఉన్న సంగతి తెలిసిందే. మిగిలిన పార్టీలు ఎన్నికల ప్రచారం విషయంలో దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం వెనుకబడి ఉంది. కీలక నేతలు ఉన్నా సరే ప్రచారం చేసే విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నారు అగ్ర నేతలు ఉన్నా సరే సమర్ధవంతంగా ప్రచారం చేయడం లేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. ఇక తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

మనిక్కమ్ ఠాగూర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బిజెపి, తెరాస టార్గెట్ గా విమర్శలు చేసారు. బీజేపీ మత పరంగా విభజించాలని చూస్తుంది అని మండిపడ్డారు. టిఆర్ఎస్ అవినీతి సొమ్మును పంచి రాజకీయాలు చేస్తుంది అని మండిపడ్డారు. మా మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ కి విజయం కల్పిస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. టిఆర్ఎస్ అవినీతి పాలన పెచ్చుమీరిపోయింది అని విమర్శించారు. మునిసిపల్ మంత్రి, ఆయన అనుచరులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు అన్నారు.

బీజేపీ మతం, టిఆర్ఎస్ అవినీతి తో కూడుకొని ఉన్నాయి అని మండిపడ్డారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతికి పాల్పడుతుందని అంటున్నారు అని, ఐ.టి. ఈడీ, సీబీఐ కేంద్ర విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయి అని ఆయన నిలదీశారు. ప్రతీ కేంద్ర మంత్రి రాష్టానికి వచ్చి టిఆర్ఎస్ అవినీతికి పాల్పడినట్టు మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని నిలదీశారు. టిఆర్ఎస్, బీజేపీ లు ఢిల్లీలో దోస్తీ, గల్లీ లో కుస్తీ అన్నట్టుగా రాజకీయాలు చేస్తున్నారు ఆయన విమర్శలు చేసారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హైదరాబాద్ లో మత సామరస్యాన్ని చెడగొడుతున్నారు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: