సాధారణంగా తుమ్ము వచ్చింది అంటే చాలామంది ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా  వైరస్ సమయంలో అయితే తుమ్మడం అనేది ఒక నేరంగా మారిపోయింది. ఎక్కడైనా ఎవరైనా తుమ్మారు  అంటే చాలు  వారిని ఏదో నేరస్తులుగా చూస్తూ ఉంటారు అందరూ. అందుకే ప్రస్తుతం కరోనా  వైరస్ సమయంలో తుమ్ము  వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా కష్టపడి ఆపుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఇలా తుమ్ము  ఆపుకోవడం ద్వారా అందరిచూపు మీద పడకుండా చేసుకున్నారు అని అనుకున్నప్పటికీ.. ఇలా చేయడం వల్ల మాత్రం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అన్నది మర్చిపోతారు చాలామంది.



 తుమ్ము బలవంతంగా ఆపుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని ఇప్పటికి ఎంతో మంది నిపుణులు సూచించారు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా ప్రతి మనిషికి వచ్చే సుమారు  గంటకి 100 మైళ్ళ  వేగంతో వస్తుందట. బలవంతంగా తుమ్ము ఆపితే దానికి రెట్టింపు మెదడుపై ప్రభావం పడుతుందని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఇక్కడ ఓ వ్యక్తి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. 34 ఏళ్ల వ్యక్తి తుమ్ము ని బలవంతంగా ఆపేందుకు ప్రయత్నించడంతో ఏకంగా గొంతుకు రంధ్రం పడింది. ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. తుమ్ము వస్తున్న సమయంలో ముక్కు నోటిని ఒక్క సారి మూసేసారు సదరు వ్యక్తి.



 దీంతో అతడి స్వరం పూర్తిగా మారిపోయింది. గొంతు బాగా వాచింది. ఇక నొప్పి కూడా బాగా పెరిగిపోవడంతో వైద్యులను సంప్రదించగా వైద్యులు చెక్ చేసి షాక్ అయ్యారు. గొంతును స్కాన్ చేసి చూడగా  ఏకంగా గొంతు లోపలి భాగంలో రంధ్రం పడినట్లు గుర్తించారు వైద్యులు. అంతేకాకుండా గాలి బుడగలు అతని గుండె కండరాలు కణజాలాల్లో కూడా గుర్తించారు. ఏకంగా తుమ్ము ఆపుకోవడం ద్వారా ఇలా సదరు వ్యక్తి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. వారం రోజులు చికిత్స తీసుకున్న తరువాత అతడు ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇలా తుమ్ము ఆపడం ద్వారా ప్రాణాలమీదికి వస్తుందని ప్రస్తుత నిపుణులు హెచ్చరిస్తున్నారు,

మరింత సమాచారం తెలుసుకోండి: