తెలంగాణలో జిహెచ్ఎంసి ఎన్నికల వేడి రాజుకుంది. మొన్నటివరకు దుబ్బాక ఉప ఎన్నికల తోనే అట్టుడికిపోయిన తెలంగాణ రాజకీయాలు  ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల తో మరోసారి హాట్ హాట్ గా మారి పోయాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపు అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకున్నాయి ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రచారానికి మరి కొన్ని రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యం లో ప్రస్తుతం అందరూ కూడా ప్రచార రంగం లో దూసుకుపోతున్నారు.



 ప్రస్తుతం గ్రేటర్ పరిధి లోని ఏ డివిజన్లో చూసిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాల తో హోరెత్తిస్తున్నారు. అంతేకాకుండా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తాము అధికారం లోకి వస్తే డివిజనల్ లో ఎలాంటి సదుపాయాలు కల్పిస్తాం  ఎలాంటి అభివృద్ధి చేపడతాం అనే విషయాలను కూడా ఓటర్లకు చెబుతూ ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఉన్న కొంత సమయం లోనే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు.



 ఈ క్రమంలోనే ఇటీవలే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని 128వ అయినా చింతల్ లో  టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముమ్మర ప్రచారం నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి రషీదా  మహమ్మద్ రఫీ చింతల్ డివిజన్ లో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రషీద  మహమ్మద్ రఫీ తో కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానం ప్రచారంలో పాల్గొన్నారు.  ఈ క్రమంలోనే ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరికి వివరిస్తూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: