ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరిగిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ వారు యథావిధిగా చంద్రబాబుని గట్టిగానే టార్గెట్ చేసి ముందుకెళ్లినట్లే కనిపించింది. అధికార పార్టీ నేతలు బాబుపై ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. సీఎం జగన్ సైతం బాబుని ఒక ఆట ఆడుకున్నారు. ఇక ఇవి చూసి తట్టుకోలేని బాబు, అసెంబ్లీలోనే బైఠాయించిన సీన్స్ కనిపించాయి. అయితే అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం ఎలా ఉన్నా...తాజాగా కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఇక దీనిపై వ్యవసాయ మంత్రి కన్నబాబు స్పందిస్తూ, జగన్ ప్రభుత్వం అన్నీ విధాలుగా ఆదుకుంటుందని చెప్పి, రైతులకు న్యాయం చేసేది జగన్ ప్రభుత్వమే అని చెప్పారు. అలాగే రైతు భరోసా కింద రూ. 12,500 హామీ ఇచ్చిన, రూ.13,500 ఇస్తున్నామని చెప్పారు. అయితే దీనిపై టీడీపీ నేతలు వేరే లెక్కలు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పే లెక్కలు తప్పని మాట్లాడుతున్నారు. ఎందుకంటే రైతులకు భరోసా కింద ఇస్తున్న 13,500 రూపాయల్లో కేంద్రం స్కీమ్ కింద 6 వేలు వస్తున్నాయని, ఇక మిగిలిన రూ.7,500 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని వివరిస్తున్నారు.

పైగా పి‌ఎం కిసాన్ స్కీమ్ ప్రకటించక ముందే జగన్ తన పాదయాత్రలో రైతులకు రూ. 12,00 ఇస్తానని హామీ ఇచ్చారని, అంటే జగన్ అధికారంలోకి వచ్చాక తాను ఇస్తానని చెప్పిన 12,500 ప్లస్ కేంద్రం ఇచ్చే 6 వేలు కలుపుకుంటే మొత్తం రైతులకు రూ. 18,500 ఇవ్వాలని, కానీ ప్రభుత్వం మాత్రం అలా చేయకుండా, కేవలం 13,500 మాత్రమే ఇస్తుందని చెబుతున్నారు. అంటే రైతులకు 5 వేలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు అన్నీ ఇలాగే ఉన్నాయని, ప్రతిదానిలో ఏదొక లింక్ ఉందని, కానీ అది ప్రజలు అర్ధం కావడం లేదని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: