కానీ బైడెన్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడా పరిస్థితి లో మాత్రం మార్పు రాలేదు. అంతే కాకుండా అమెరికా లో ఈ మధ్య కాలంలో బయట పడిన కొన్ని రకాల పరిణామాలు కూడా చైనాపై ప్రస్తుతం అమెరికన్లకు తీవ్రస్థాయిలో వ్యతిరేక తీసుకొచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే లడఖ్లో చైనా నిర్మాణాలు చేపడుతున్నటువంటి వ్యవహారంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దులో చైనా నిర్మాణాలపై శాటిలైట్ చిత్రాలు కూడా బయట పడిన నేపథ్యంలో.. భారత సంతతికి చెందినటువంటి అమెరికా చట్టసభ సభల్లో చైనా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరిహద్దుల్లో చైనా నిర్మాణాలు చేపడుతున్నట్టు వస్తున్న వార్తలు నిజమైతే.. వాస్తవాలను మారుస్తూ చైనా సైన్యం భారత్ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో అమెరికా అంగీకరించదని.. రానున్న రోజుల్లో దీని పర్యవసానమే చైనా తప్పక వస్తుంది అంటూ అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇలా భారత్ నుంచి చైనా స్వాధీనం చేసుకున్న విభాగాలలో శాశ్వత నిర్మాణాలు చేస్తూ ఉండటాన్ని తప్పుబట్టిన అమెరికా రానున్న రోజుల్లో చైనా పర్యవసానాన్ని అనుభవించక తప్పదు అంటూ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి