రాజకీయ రంగం అన్న తర్వాత అధికార పార్టీకి ప్రత్యర్థి పార్టీలకు విమర్శలు మరియు ఎత్తిపోతలు సహజంగానే చూస్తుంటాం. సమయం సందర్భం చూసుకొని ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించడం సదా  మామూలే. కాకపోతే ఇక్కడ కొన్ని రాజకీయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. నేతల పెదవులపై నుండి జారే మాటలను బట్టి... అటు ఇటు అయితే ఎదుటివారు కౌంటర్ వేసేందుకు రెడీగా ఉంటారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల మాట అటుంచితే... ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు మాత్రం ఆచితూచి ఎంతో ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకు అంటే వారి ప్రతి మాట కౌంట్ అవుతుంది.

ప్రత్యర్థులు ప్రతి పదాన్ని గమనిస్తుంటారు.... మరోవైపు  ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజలకు సైతం ఆ మాటలు సబబుగానే అనిపించాలి... అప్పుడు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి పార్టీ నేతలు సైతం మీడియా ముందు కానీ .... ప్రసంగాల సమయంలో కానీ మాట్లాడే సమయంలో ఎంతో ఆలోచించి వ్యవహరిస్తున్నారు. ఎక్కడా తడబాటు లేకుండా తమ పని తాము చేసుకుంటూ నోరు జారకుండా జాగ్రత్తగా నడుచుకుంటున్నారు.  అధికార పార్టీ నేతలు... ప్రత్యర్ధి పార్టీ విమర్శలకు ఆచితూచి మరి గట్టి కౌంటర్ లు ఇస్తూ.. వారి దూకుడుకు కళ్లెం వేస్తున్నారు. అలాంటిది అధికార పార్టీలో ఓ నేత చేసిన పనికి గుర్రుగా ఉన్నారట పార్టీ అధినేత.  గుంటూరు జిల్లా గుర‌జాల‌కు చెందిన ఎమ్మెల్యే, సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చిన కాసు మ‌హేష్ రెడ్డి వ్యవహార శైలికి పార్టీ ఇరుక్కుంటుంది అన్న వాదన వినిపిస్తోంది.

 తాజాగా టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు.. ఎప్పటిలాగే వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏకంగా.... పార్టీ హ‌త్యా రాజ‌కీయాల‌కు అండగా నిలబడుతుందని విమర్శించారు.. అంతేకాకుండా త‌మ పార్టీ నేత‌లు ఇప్ప‌టికే ముగ్గురు హ‌త్య‌కు గుర‌య్యార‌ని అధికార పార్టీ పై విమర్శలు గుప్పించారు. అదేవిధంగా ఎమ్మెల్యే కాసు నేతృ త్వంలో గనులను దోచేస్తున్నార‌ని య‌ర‌ప‌తినేని ఆరోపణలు చేశారు అయితే.. ఈ స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థుల‌ ట్రాప్ కు దొరకకుండా అదే రేంజ్ లో  కౌంట‌ర్ ఇవ్వాల్సిన కాసు కాస్తా అడ్డంగా బుక్ అయ్యేలా వ్య‌వ‌హ‌రించారు. ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే...గ‌తంలో మా పార్టీ నేత‌ల‌పై హ‌త్యా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అందుకే వారు త‌మ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో భాగంగా హ‌త్య‌లు చేసి ఉండొచ్చు“ అని ఘాటుగా స్పందించారు. దాంతో ఈ మాటల అంతరార్థం తమ పార్టీ నేతలు హత్యకేసులో ఉన్నారన్నది నిజమేనేమో అని అంగీకరించినట్లయింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి గా కాసు.... అంటున్నారట అధికార పార్టీ నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: