ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు అవసరం ఉన్నాయి అంటే చాలు పక్క వాళ్ళ  దగ్గర అడిగి తీసుకోవడం లాంటివి చేసేవారు. కానీ ఇప్పుడూ పక్కవాడిని అడగాల్సిన అవసరం లేకుండా పోయింది ఎందుకంటే ప్రస్తుతం ఎన్నో బ్యాంకులు తమ కస్టమర్లకు రుణాలు అందించి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే.  అతి తక్కువ వడ్డీకే తమ కస్టమర్ల కు రుణాలు అందిస్తూ మెరుగైన సర్వీసులు అందిస్తున్నాయి ఇప్పటికే ఎన్నో రకాల బ్యాంకులు  రుణ సదుపాయాన్ని కల్పించాయి.  ఇక ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా తమ కస్టమర్లకు మరింత మెరుగైన సర్వీసులు అందించడంలో భాగంగా ఇటీవలే కొత్త సర్వీస్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.


 సులభంగానే రుణాలు పొందేందుకు అవకాశం కల్పిస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా.  డిజిటల్ లెండింగ్ ప్లాట్ ఫామ్ సర్వీసులను ఆవిష్కరించింది. దీనిద్వారా కస్టమర్లు ఆన్లైన్లోనే నిమిషాల వ్యవధిలో రుణం పొందేందుకు అవకాశం ఉంటుంది. హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ లాంటి పలు రకాల రుణాలను ఎంతో సులభతరమైన రీతిలో తమ కస్టమర్లకు అందించేందుకు సిద్ధమయింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇక ఈ రుణాల కోసం ఆన్లైన్లోనే అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది.


 ఇక తీర్మానానికి సంబంధించి కస్టమర్లు అన్ని అర్హతలు కలిగి ఉంటే కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే రుణాన్ని సూత్రప్రాయంగా ఆమోదం పొంది రుణ మొత్తాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది.  బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా ఆన్లైన్లో రుణాలు అందిస్తుంది బ్యాంక్ ఆఫ్ బరోడా.  బరోడా వెబ్సైట్ లేదా బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సోషల్ మీడియా వంటి వాటిల్లో డిజిటల్ రూపంలో సులభతరంగా రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.  ఇప్పటికే అర్హత కలిగిన ఎంతోమంది కస్టమర్లకు ఫ్రీ అప్రూవ్డ్ రుణాలు అందిస్తున్నాము అంటూ ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: