అయితే ఒకే నెలలో ఇలా గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగడం ఇది రెండవసారి అని చెప్పవచ్చు. ఇలా వరుసగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. డిసెంబర్ ఒకటవ తేదీన గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెరిగింది. 700 రూపాయలు చెల్లించి గ్యాస్ సిలిండర్ను కొనుగోలు చేయాలి అంటే సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు.అయితే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ను కేవలం రెండు వందల రూపాయలకే పొందే అవకాశముంది. అదెలా అని అంటారా..
వాస్తవంగా అయితే గ్యాస్ సిలిండర్ ధర ఏడు వందల రూపాయలే. కానీ క్యాష్ బ్యాక్ ఆఫర్ కారణంగా 500 రూపాయలు మనం సేవ్ చేసుకుని రెండు వందల రూపాయలు వెచ్చించి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే హెచ్పి ఇండెన్ భారత్ గ్యాస్ బుకింగ్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ప్రముఖ డిజిటల్ వాలెట్ పేటియం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే 500 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తోంది. తద్వారా మీరు తీసుకున్న గ్యాస్ సిలిండర్ కేవలం 200 రూపాయలకు మాత్రమే వచ్చినట్లు అవుతుంది. దీనికోసం పేటీఎం యాప్ లోకి వెళ్లి.. రీఛార్జ్ అండ్ పే బిల్స్ ఆప్షన్ లోకి వెళ్ళాలి అప్పుడు బుక్ సిలిండర్ పై క్లిక్ చేసి ఏ గ్యాస్ వాడుతున్నారు ఎంపిక చేసుకుని రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. పేమెంట్ ఆప్షన్ ను ఎంచుకొని బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 31 వరకు ఉండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి