దేశంలో ఇపుడు  ఎక్కడ చూసినా చర్చగా ఉన్న అంశం జమిలి ఎన్నికలు. జమిలి  అసలుఎన్నికలు జరుగుతాయా జరగవా అన్న సందేహాలు నిన్నటి దాకా ఉండేవి. కానీ ఈ మధ్యనే హఠాత్తుగా జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. దానికి తగినట్లుగానే కేంద్రం కూడా కసరత్తు చేస్తూ వస్తోంది.

జమిలి ఎన్నికలు పెట్టాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. దానికి తగిన బలాన్ని బీజేపీ సమకూర్చుకుంటోంది. బీజేపీకి దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో సొంతంగానే బలం ఉంది. అలాగే మిత్ర పక్షాలతో కలిపి మరి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఇక వీటితో పాటుగా చూసుకుంటే తటస్థ పార్టీలుగా ఉన్న టీయారెస్, వైసీపీ, బిజూ జనతాదళ్ వంటివి ఉన్నాయి. గత ఏడాది చివరలో వరసగా ఢిల్లీ వెళ్లిన కేసీయార్, జగన్ లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమిలి ఎన్నికల విషయమే చర్చించి ఉంటారని ప్రచారం అయితే సాగుతోంది. దానికి రెండు తెలుగు రాష్ట్రాల సారధులు  ఓకే చెప్పాయని కూడా అంటున్నారు.

ఆ విధంగా నాటి నుంచే అక్కడా ఇక్కడా దూకుడుగా తెలుగు రాజకీయాలు సాగుతున్నాయని చెబుతున్నారు. మరో వైపు చూసుకుంటే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అన్నది దేశంలో మొదలైంది. అది వచ్చే ఏడాది అంటే 2022 ద్వితీయార్ధం వరకూ సాగుతుంది అంటున్నారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అవుతూనే జమిలి ఎన్నికలకు డేట్ ఫిక్స్ చేస్తారని చెబుతున్నారు. దేశంలో కరోనాను సమర్ధంగా ఎదుర్కోవడమే కాకుండా వ్యాక్సిన్ కూడా అందించిన ఘనతను తన ఖాతాలో వేసుకుంటూ మోడీ ఎన్నికల రంగంలోకి దిగుతారని చెబుతున్నారు.

అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణంగా  2022 ద్వితీయార్ధాన్ని ఎంచుకున్నారని చెబుతున్నారు. 2022 అంటే సెప్టెంబర్ అక్టోబర్ లలో జమిలి ఎన్నికలు జరుగుతాయని కచ్చితమైన అంచనాలు వేస్తున్నారు. ఆ టైం అన్ని రకాలుగా గెలిచేందుకు  కలసి వస్తుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు లెక్కలు వేస్తున్నారు అంటున్నారు. ఇప్పటికి కచ్చితంగా ఏడాదిన్నర కంటే తక్కువ సమయం మాత్రేమే ఉంది. అందుకే అన్ని పార్టీలు జమిలి జ్వరంతో వేడెక్కిపోతున్నాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: