తెలంగాణ రాజకీయాలలో విజయశాంతి ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎప్పటికప్పుడు తెలంగాణా ప్రభుత్వ తీరును ఎండగడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇక తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ఎప్పుడూ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు విజయశాంతి. అయితే మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన విజయశాంతి మొన్న బిజెపి పార్టీలో చేరారు అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతున్న బిజెపి పార్టీ... కేసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధిస్తుంది అన్న విషయం తెలిసిందే



 ఈ క్రమంలోనే అటు బీజేపీ నేతలు అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు కేసీఆర్ సర్కారు తీరును తీవ్రస్థాయిలో బీజేపీ నేత ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధిస్తున్నారు. కాగా  విజయశాంతి మరోసారి కేసీఆర్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా విచ్చలవిడిగా దోపిడీలు జరుగుతాయి అంటూ వ్యాఖ్యానించారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. కేసిఆర్ బంగారు తెలంగాణ తెస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పారని కానీ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు అంటూ విమర్శలు గుప్పించారు.



 నా తెలంగాణ ఎటు పోతుందో కూడా అర్థం కావడం లేదు అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. నా తెలంగాణకు తెరాస పాలనలో అన్యాయం జరుగుతుంది అంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలి అంటే ప్రజలందరూ మరోసారి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బిజెపి నాయకురాలు విజయశాంతి. ఇక తెలంగాణ అభివృద్ధి బీజేపీ పార్టీ తోనే సాధ్యం అవుతుందని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు బీజేపీ నేత విజయశాంతి.

మరింత సమాచారం తెలుసుకోండి: