హైదరాబాద్ లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. సోమాజిగూడ లో ప్రెస్ క్లబ్ లో ఓ భర్త ప్రెస్ మీట్ ను పెట్టీ, భార్య గుట్టు రట్టు చేశారు.అదనపు కట్నం వేధింపుల కేసును ఎదుర్కొంటున్న ఓ సగటు భర్త. అతడు ప్రెస్ మీట్ పెడుతున్న విషయం తెలుసుకుని అతడి భార్య, ఆమె కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. నానా రభస సృష్టించారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి, ఆమెను, వారి కుటుంబ సభ్యులను అక్కడకు పంపించారు. 



ఈ విషయం గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దాంతో భార్య చేస్తున్న పని గురించి బయట పెట్టాడు. ఆమె కుటుంబ సభ్యులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అసలు విషయాన్ని వివరించాడు. వివరాల్లోకి వెళితే.. 11 వ తారీఖున సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో లావణ్య, ఆమె కుటుంబ సభ్యులు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మాట్లాడుతూ.. అదనపు కట్నం కావాలని డిమాండ్ చేస్తున్నాడు. అత్తమామలు కూడా చిత్రహింసలు పెడుతున్నారు. నన్ను కాపురానికి తీసుకెళ్లడం లేదు..అంటూ అతని పై వేధింపుల కేసు పెట్టింది. అంతకన్నా ముందు ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. భర్త వేధిస్తున్నాడని, అతని పై కేసు పెడుతున్నానని చెప్పింది. 



కొద్ది రోజుల క్రితం అదే క్లబ్ లో భర్త కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. తన భార్య చెప్పింది అంతా అపద్దం అని, తనకు ఆడపిల్లలే ఇష్టం. నా పిల్లలను పోషించుకొనే శక్తి నాకుంది. నా భార్యను కాపురానికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. ఆమే రావడం లేదు. నన్ను ఇల్లరికం ఉండమని వేధిస్తున్నారు.నాకు ఇల్లరికం ఉండటం ఇష్టం లేదు. అందుకే వాళ్లు నా మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు వచ్చినా సరే, నా భార్యను నేను కాపురానికి తీసుకెళ్తాను' అని సంతోష్ తేల్చిచెప్పాడు. మొత్తానికి ఇల్లరికం ఉండకపోవడం వల్లే, తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న విషయాన్ని బయటపెట్టాడు. ఈ ఘటన హాట్ చర్చలకు దారి తీసింది. ఈ ఘటన ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: