ఏపీలో పంచాయితీ పోరులో ఆసక్తికర పోటీ జరగనుంది. రాష్ట్రంలో తిరుగులేని ఆధిక్యం చెలాయిస్తున్న వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇస్తుంది. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఊపు వైసీపీకి పంచాయితీలో కనబడటం లేదు. కానీ అధికారంలో ఉంది కాబట్టి వైసీపీకి కాస్త ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. అయితే టీడీపీ కూడా చాలా చోట్ల టఫ్ ఫైట్ ఇస్తుంది.

ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కమ్మ నేతల మధ్య జరిగే వార్ ఆసక్తికరంగా మారింది. కమ్మ వైసీపీ ఎమ్మెల్యేలు, కమ్మ టీడీపీ నేతల మధ్య పంచాయితీ పోరు జరగనుంది. వినుకొండ, పెదకూరపాడు, తెనాలి నియోజకవర్గాల్లో కమ్మ ఎమ్మెల్యేలు, నేతల మధ్య ఎన్నికల ఫైట్ జరుగుతుంది. వినుకొండలో వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు, టీడీపీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు గట్టి పోటీ ఇస్తున్నారు.

అటు పెదకూరపాడులో వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావుకు టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్, తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యేకు అన్నాబత్తుని శివకుమార్‌కు టీడీపీ నేత ఆలపాటి రాజా పోటీ ఇస్తున్నారు. అయితే ప్రత్యర్ధులుగా ఉన్న ఈ నాయకులు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే. పంచాయితీ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని చూస్తున్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలకే ఎక్కువ పంచాయితీలు గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ టీడీపీ నేతలని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.

ముగ్గురు టీడీపీ నేతలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. పైగా ముగ్గురు టీడీపీ నేతలకు వైసీపీ ఎమ్మెల్యేలు కంటే సొంత ఇమేజ్ ఎక్కువ. దీని బట్టి చూసుకుంటే వినుకొండ, పెదకూరపాడు, తెనాలి నియోజకవర్గాల్లో టీడీపీ హవా ఉండేలా ఉంది. పైగా ఈ 20 నెలల కాలంలో వైసీపీ ఎమ్మెల్యేలు మంచి పనితీరు కనబర్చలేదు. మరి చూడాలి ఈ కమ్మ వర్సెస్ కమ్మ పోరులో పైచేయి ఎవరిది ఉంటుందో? 

మరింత సమాచారం తెలుసుకోండి: