సాధారణంగా ప్రతిపక్షాల మీద దాడులు అనే విషయం మనకు గుర్తు వస్తే కచ్చితంగా తమిళనాడు రాష్ట్రం గుర్తొస్తుంది. తమిళనాడులో గతంలో అనేక భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. జయలలిత, కరుణానిధి మధ్య ప్రధానంగా పోటీ ఉన్న సమయంలో చాలా వరకూ విపక్షాలు మీద దాడులు చేసిన పరిస్థితి మనం చూసే వాళ్ళం. అధికార పార్టీ ఏది ఉన్నా సరే ప్రతిపక్ష నేతలపైన కచ్చితంగా కక్ష సాధింపు చర్యలకు దిగే పరిస్థితి ఉండేది. అధికార పార్టీ నేతలు అయితే కొన్ని నియోజకవర్గాల్లో అద్దు అదుపు లేకుండా ఉండే వాళ్ళు.

ఇప్పుడు పరిస్థితి దాదాపు ఆంధ్ర ప్రదేశ్ లో అలాగే ఉంది అని చెప్పాలి. గుంటూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ సహా ఇతర ఏ పార్టీ కూడా బలపడటానికి అవకాశం లేకుండా ప్రవర్తిస్తున్న తీరు అలాగే పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా వారు అనుసరిస్తున్న విధానాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టే విషయంలో అధికార పార్టీ నేతలు ముందు నుంచి కూడా ఉత్సాహంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదే సమస్యగా మారిందని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ తో ముందు నుంచి కూడా కలిసి ఉన్న వాళ్ళని ఇప్పుడు గ్రామాల్లో ఇబ్బంది పెట్టడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడిన వైసిపి నేతలను కూడా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఆలోచన మారకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడవచ్చు అని హెచ్చరిస్తున్నారు. సీఎం జగన్ దీని మీద దృష్టి పెట్టాలని కూడా సూచిస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆందోళన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇక నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా ఇలాగే ఉందని కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ప్రజలను కూడా ఇబ్బంది పెట్టడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో వైసీపీ కార్యకర్తలు ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: