అమరావతి: ఎన్నికల కమిషన్‌ను సైతం వైసీపీ నేతలు దూషించడాన్ని ఏపీ సీపీఐ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు వస్తుందని, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈసీకి సహకరిస్తారని అంతా భావించారని, కానీ ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రవర్తింస్తోందని రామకృష్ణ అన్నారు. అత్యంత బాధ్యతగల స్థానంలో ఉన్న రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఎన్నికల కమిషన్‌నే కించపరిచేలా మాట్లాడుతుండడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్మోహన్‌‌రెడ్డి వాయిస్‌గా ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటారని, ఆయన కూడా ఎస్ఈసీని కించపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వమే ఆలోచించుకోవాలని హితవు పలికారు. అంతేకాకుండా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలు నిర్వహిస్తూనే ఏకగ్రీవాలపై ప్రకటనలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఇలాంటి చర్యలపై వైసీసీ సర్కార్ ప్రజలకు సమాధానం చెప్పాలని, ఇప్పటికే
ప్రజల విశ్వాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని, ఇక ఇలాంటి చర్యలు ఆ పార్టీ పరపతిని మరింత దిగజార్చడం ఖాయమని అన్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా 125 జడ్పీటీసీ, 2 వేలకు పైగా ఎంపీటీసీలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుందని, పోలీసులను ప్రయోగించి, ప్రలోభాలు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి వైసీపీ ఈ ఏకగ్రీవాలు చేసుకుందన్న విషయం అందరికీ తెలుసని రామకృష్ణ ఆరోపించారు.

ఇలా దౌర్జన్యంగా ఏకగ్రీవాలు చేసుకునే పక్షంలో అసలు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.
అలాగే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్న వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీకి ప్రభుత్వం సిద్ధం కావటం ఎన్నికల కోడ్ కు విరుద్ధమేనని, ఇలాంటి చర్యలు కచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఆయనన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలు పూర్తయ్యే వరకు
రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని వాయిదా వేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషనర్‌ను తాము కోరుతున్నామని రామకృష్ణ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: