ఏపీలో ఎన్నిక‌లు జ‌రుగుతోన్న 12 కార్పొరేష‌న్లు... 75 మునిసిపాల్టీలు, న‌గ‌ర పంచాయ‌తీల్లో ప‌లు చోట్ల అధికార వైసీపీకి వార్ వ‌న్‌సైడ్‌గానే ఉంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌కాశం జిల్లా కేంద్ర‌మైన ఒంగోలు కార్పొరేష‌న్లో టీడీపీ బేజారు అవుతోన్న ప‌రిస్థితి ఉంది. మార్చి 10న ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌పున మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. ఎన్నికల్లో అధికార వైసీపీ విజయం పోలింగ్ కు ముందే దాదాపు విజయం ఖాయమని తేలిపోయింది. ఇక్కడ ప్రతిపక్షం అడ్ర‌స్ లేదు.

2014లో గెలిచిన మాజీ జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు దామ‌చ‌ర్ల జ‌నార్థ‌న్ ఇప్పుడు ఒంగోలును వ‌దిలేసి హైద‌రాబాద్‌లో ఉంటున్నారు. గత రెండేళ్ల‌లో ఎమ్మెల్యేగా ఓడిపోయాక చాలా త‌క్కువ సార్లు మాత్ర‌మే ఆయన ఒంగోలు మొఖం చూశారు. పైగా త‌న అనుచ‌రుల‌తో ఇప్పుడు క‌ష్ట‌ప‌డినా మ‌నం గెలుస్తామా ? ఎన్నిక‌ల‌కు ముందు చూద్దాంలే అన్న ధోర‌ణితోనే ఆయ‌న ఉంటున్నారు. ఇక న‌గ‌రంలో మంత్రి బాలినేనితో పాటు చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం, మాజీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు వ‌ర్గం ఉంది.

వారిద్ద‌రిని బాలినేని త‌న మంత్రాంగంతో పార్టీలో చేర్చుకున్నారు. దీంతో క‌మ్మ‌, రెడ్డి, వైశ్యుల‌తో పాటు కాపు ఈక్వేష‌న్లు అన్ని ఇప్పుడు బాలినేనికి క‌లిసి వ‌స్తున్నాయి.  టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్ష బాధ్యతలను నూకసాని బాలాజీకి అప్పగించినా పార్టీ ఏమాత్రం ముందుకు నడవడం లేదు.  అయితే జ‌నార్థ‌న్ హ‌యాంలో మాత్రం న‌గ‌రంలో మంచి అభివృద్ధి జ‌రిగింది. ప‌ట్ట‌ణ ప్రాంతం కావ‌డంతో పాటు గ‌త ఇర‌వై నెల‌ల కాలంలో ఏ మాత్రం అభివృద్ధి లేకపోవ‌డ‌మే ఇక్క‌డ వైసీపీకి మైన‌స్. ఏదేమైనా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒంగోలులో వైసీపీ వార్ వ‌న్‌సైడ్ కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: