ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంత మంది అగ్ర నేతలు ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాయలసీమ జిల్లాలకు చెందిన కొంతమంది కీలక నేతలు మాట్లాడటం లేదు. అందులో ప్రధానంగా అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ అసలు మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీ లోకి వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరిగింది. ఇటీవల కొంత మంది భారతీయ జనతా పార్టీ నేతలతో ఆయన చర్చలు జరిపారని భారతీయ జనతా పార్టీలోకి రావడానికి సుముఖంగా ఉన్నారని కానీ తనకు వచ్చే ఎన్నికల్లో అనంతపురం ఎంపీ సీటు కావాలని ఆయన కోరారు అని రాజకీయ వర్గాలు అన్నాయి.

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా తనకు అనంతపురం ఎంపీ సీటు కావాల్సిందే అని ఆయన చెప్పారు. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో తెలియదు కానీ సీఎం రమేష్ మాత్రం పయ్యావుల కేశవ్ కి సీటు హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతుంది. జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం కంటే కూడా తన వర్గాన్ని గెలిపించుకునే విధంగానే పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలో తీవ్రంగా కష్టపడ్డారు.

ఆయన సోదరుడు కూడా అదే విధంగా కష్టపడిన పరిస్థితి మనం చూశాం. దీనిపై తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఇక వైసీపీ నేతలు కూడా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని పోలీసు అధికారులు కూడా ఆయనకి సహకరిస్తున్నారు అని ఆరోపణలు చేయడం మనకు వినబడింది. అయితే ఇప్పుడు పయ్యావుల కేశవ్ రాజకీయ ప్రయాణం పై చంద్రబాబు నాయుడు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడాలని ప్రయత్నించినా సరే మాట్లాడలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: