ఈ మధ్యకాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహార నియమాలు పాటించడం లేదు ఎవరు. కనీసం ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం ఎవరికీ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే సాధారణంగా సరైన సమయంలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడో సమయం దొరికినప్పుడు మాత్రమే ఆహారం తీసుకుంటూ ఉండటం వ్యాయామానికి పూర్తిగా దూరంగా ఉండడంతో వివిధ రకాల సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు ఎంతోమంది.



 ఇలా ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కూడా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎప్పుడూ వేధిస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో అయితే చాలామంది మసాలాలు దట్టించిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండటం.. పౌష్టిక ఆహారాన్ని  అంతగా ఇష్టపడకపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇంట్లో వంట కంటే మసాలాలు దట్టించిన రెస్టారెంట్ వంటకాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమందికి గ్యాస్ట్రిక్ సమస్యలతో చుక్కలు చూస్తున్నారు అనే విషయం తెలిసిందే.  అయితే గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ..  తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తూ ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



 ఈ క్రమంలోనే గ్యాస్ట్రిక్ సమస్యలకు సహజసిద్ధమైన పదార్థాలతోనే చెక్ పెట్టవచ్చునని సూచిస్తున్నారు నిపుణులు.  ఒకవేళ మీరు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ ఉండటం లేదా అజీర్ణ సమస్య కూడా వేధిస్తూ ఉంటే ఐదు ఆరు తులసి ఆకులు నమిలి రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల నిమిషాల్లో ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.  అంతేకాకుండా పుదీనా నమిలినా  మరగించి తాగినా కూడా ఉపశమనం ఉంటుందట. కరివేపాకు ని పచ్చిగా తిన్నా  కూడా అజీర్ణ  సమస్యకు చెక్ పెట్టే అవకాశం ఉందట. అజీర్ణ సమస్య ఉంటే కొన్ని తమలపాకులతో ఉపశమనం లభిస్తుందట. గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే వాము ఆకులను నమిలినా ఉపశమనం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: