ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఏదో ఒక విధంగా దొంగతనానికి పాల్పడి అందినకాడికి దోచుకుని  జల్సాలు చేయడానికి ఈ మధ్యకాలంలో ఎంతోమంది సిద్ధమవుతున్నారు. అంతేకాదు కొంతమంది అయితే దొంగతనం చేయడానికి సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో దొంగతనం చేయడం ఎలా.. దోపిడీ చేసిన తర్వాత పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడం ఎలా అన్న దానిపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటూన్నారు  ఇక ఆ తర్వాత ఎంతో చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు.



  రోజు రోజుకు వినూత్నరీతిలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకోవడంలో పోలీసులకు సవాలుగా మారిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా అయితే దొంగలు తాళాలు  వేసి ఉన్న ఇంట్లో దొంగతనాలకు పాల్పడి అందినకాడికి దోచుకో పోతూ ఉంటారు. కొంతమంది ఏకంగా ఏటీఎం లోకి ప్రవేశించి ఏటీఎం బద్దలుకొట్టి దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ మాత్రం దొంగలు వినూత్నంగా దోపిడీ చేశారు. ఇళ్ల  తాళాలు పగలగొట్టి దొంగతనం చేయడం..  ఏటీఎం బద్దలు కొట్టి డబ్బులు దోచుకోవడం లాంటి ప్లాన్స్  వర్కౌట్ కావు అనుకున్నారో ఏమో..  ఏటీఎం ఎత్తుకెళ్లారు.



 ఈ ఘటన తమిళనాడులోని తిరుపూర్ సమీపంలో చోటు చేసుకుంది. ఏటీఎంలో నగదును దోచుకెళ్లాలి అనుకుని  నలుగురు సభ్యుల ముఠా ప్లాన్ వేసుకుంది. ఈ క్రమంలోనే ప్రాన్ ప్రకారం ఏటీఎం సెంటర్లో కి వెళ్ళీ ఎటిఎం బద్దలు కొట్టి అందులో ఉన్న డబ్బు దోచుకోవడానికి ఎంతగానో ప్రయత్నించారు అయితే ఎంతగా ప్రయత్నించినప్పటికీ బద్దలు కొట్టడం ఆ దొంగల వల్ల  కాలేదు. ఈ క్రమంలోనే మొత్తంగా ఏటీఎం ఎత్తుకెళ్లాలి  అని భావించారు ముసుగులు వేసుకున్న నలుగురు దొంగలు. తాడుతో కట్టి ఇక ఆ తర్వాత కార్ లో  పెట్టుకొని వెళ్ళిపోయారు.  ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా దీని ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: