ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యాయి. పలువురు కీలక పార్టీల నేతలు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డపై ఫైర్ అయ్యారు. ఇక ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సమావేశం అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఆ పార్టీ నేత నారాయణమూర్తి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో  82 శాతం పైగా ఓటింగ్ జరగడం  శుభపరిణామం  అని అన్నారు.

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరాం అని వివరించారు. ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు చేస్తోన్న వ్యవహారాలపై ఎస్ ఈ సి   దృష్టికి తెచ్చాం అని వివరించారు. చంద్రబాబు పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాం అని అన్నారు.  డిపోతామని వైకాపా నేతల వాహనాలను తెదేపా వారు దహనం చేస్తున్నారని తెలిపాం అని ఆయన పేర్కొన్నారు.  వాలంటీర్ల హక్కులు కాలరాయవద్దని, హక్కులను కాపాడాలని కోరాం అని మీడియాకు వివరించారు.

మొబైల్ ఫోన్ల ను డిపాజిట్ చేయాలని ఆదేశాలపై అభ్యంతరాలు తెలిపాం అని అన్నారు.  ఏదేని అత్యవసర పరిస్థితుల్లో సాయం అందించడం సాధ్యం కాదని తెలిపాం  అని వివరించారు. వాలంటీర్లను నిర్భంధించినట్లు అవుతుందని .ఇలా చేయడం సరికాదని తెలిపాం అని అన్నారు.  ఎస్ ఈ సి సానుకూలంగా స్పందించారు అని తెలిపారు.  ఓటమి పాలవుతున్నామనే తెదేపా నేతలు ఎస్ఈసీపై విమర్శలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వైకాపా అధికార ప్రతినిధి పద్మజ మాట్లాడుతూ అత్యధిక మెజారిటీ తో వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవబోతోంది అని ధీమా వ్యక్తం చేసారు. నిబంధనలపేరుతో వాలంటీర్ల  మొత్తం వ్యవస్థను నిలుపుదల చేయవద్దని కోరాం  అని అన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని ఎస్ ఈ సి  ని కోరాం  అని వివరించారు

మరింత సమాచారం తెలుసుకోండి: