వైసీపీలో ఓ కాక‌లు తీరిన నేత‌... ఇటు టీడీపీలో ఓ కాక‌లు తీరిన నేత‌.. పైగా ఇద్ద‌రు ఎమ్మెల్యేలు.. ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేల రాజ‌కీయంలో ఓ యువ‌నేత ఏం చేస్తాడో ? అన్న‌ది ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో ఆస‌క్తిగా మారింది. అద్దంకి మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ, టీడీపీ మ‌ధ్య పోరు ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న యువ‌నేత బాచిన కృష్ణ చైత‌న్య రాజ‌కీయ జీవితానికి అగ్నిప‌రీక్ష‌గా మారాయి. అద్దంకి నియోజకవర్గం అంటే మొదట గుర్తుకు వచ్చేది ఇద్దరు నాయకులే. కరణం బలరాం.., గొట్టిపాటి రవికుమార్. ఈ ఇద్దరూ, ఈ ఇద్దరి వర్గాలు లేని ఊర్లు లేవు.
ప‌దేళ్లకు పైగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వీరిద్ద‌రే కొట్టుకుంటున్నారు. గ‌త ఎన్నికల్లో చీరాల‌కు మారిన క‌ర‌ణం బ‌ల‌రాం అక్క‌డ విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ఆయ‌న వైసీపీ చెంత చేరిపోయారు. పేరుకు క‌ర‌ణం చీరాల ఎమ్మెల్యేగా ఉన్నా అద్దంకిలో ఆయ‌న‌కు బ‌ల‌మైన వ‌ర్గం ఉంది. ఇక్క‌డ నియోజ‌క వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న బాచిన కృష్ణ చైత‌న్య పుంజుకున్నారు.. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎక్కువ స్థానాల్లో వైసీపీని గెలిపించారంటే అందుకు క‌ర‌ణం వ‌ర్గం స‌పోర్ట్ కూడా ఉంది.
ఇక ఇప్పుడు మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ గొట్టిపాటిని ఢీ కొట్టాలంటే చైత‌న్య‌... అటు క‌ర‌ణం వ‌ర్గాన్ని కూడా సంతృప్తి ప‌ర‌చాల్సిందే. అక్క‌డ ఏ మాత్రం తేడా జ‌రిగినా క‌ర‌ణం వ‌ర్గం ర‌విని గెలిపించి... కృష్ణ చైత‌న్య‌కు షాక్ ఇస్తుంది. దీంతో ఇటు సొంత పార్టీలో క‌ర‌ణం వ‌ర్గాన్ని చాలా జాగ్ర‌త్త‌గా బ్యాలెన్స్ చేసుకుంటూనే అటు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి ర‌వికుమార్‌ను ఓడించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: